విద్యార్థులకు అలర్ట్ న్యూస్..స్కాలర్‌షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండి..

-

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే న్యూస్ ను చెప్పింది.బీసీ సంక్షేమ శాఖ, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం క్రింద బీసీ మరియు ఈబీసీ విద్యార్థులు ఆర్థిక సహాయం పొందేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు..


ఈ పథకం ద్వారా విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య ను అభ్యసించడానికి అవకాశం ఉన్నదని వారు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి (2022) ఆగస్టు/సెప్టెంబర్ సెషన్ కు సంబంధించి అభ్యర్థులు నమోదు చేసుకొనుటకు తేదీ 01.09.2022 న ప్రారంభమై రిజిస్ట్రేషన్ల చివరి తేదీ 30.09.2022 న ముగుస్తుందని వారు తెలిపారు. ఇతర వివరాలకు, ఆన్‌లైన్ అప్లికేషన్‌లు పొందుటకు http://www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ లో చూడాలని పేర్కొన్నారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

*.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ముందుగా https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

*.అనంతరం Overseas Scholarship Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*.అనంతరం Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi for BC and EBC students విభాగంలో Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
*.అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. కావాల్సిన వివరాలను నమోదు చేసి.. సూచించిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలి.
*. ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ను జాగ్రత్తగా ఉంచాలి.

ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు స్పెషల్ స్కాలర్‌షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రముఖ సివిల్స్ కోచింగ్ సెంటర్ శ్రీరామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకుఈ సంస్థ కోచింగ్ ఫీజులు 10 శాతం వరకు స్కాలర్‌షిప్ డిస్కాంట్ అందించనుంది. అలాగే శారీరక వైకల్యం, కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయిన విద్యార్థుల విషయంలో, ఫ్యాక్ట్ చెకింగ్ తర్వాత అభ్యర్థుల లిస్టును తయారు చేయనున్నారు.కొత్త సివిల్స్ బ్యాచ్‌ను సెప్టెంబర్ 5, 19 తేదీల్లో ప్రారంభించనునట్లు తెలిపింది.

స్కాలర్‌షిప్ సదుపాయంతో పాటు, కోచింగ్ ఖర్చును భరించలేని యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఈఎంఐ ఆప్షన్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. అభ్యర్థులు విడతల వారీగా ఫీజు చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది. ఈఎంఐ అవకాశం 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఈ ఏడాది నుంచి స్కాలర్‌షిప్‌ను ప్రారంభించనుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్ డిస్కౌంట్స్ ఏడాది పొడవునా చెల్లుబాటులో ఉంటాయని ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది..ఈ స్కాలర్‌షిప్స్ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని ఆ సంస్థ అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news