కేంద్ర స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా జీడీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల ( SSC GD Constable Final Result 2018 ) చేసింది. ఈ ఎగ్జామ్‌ను అటెండ్ చేసిన అభ్యర్థులు తమ ర్యాంకులను అఫీషియల్ వెబ్సైట్లో https://ssc.nic.in/ పరిశీలించుకోగలరని ఎస్ఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్‌మెన్ పోస్టులకు సంబంధించిన ఈ పరీక్షను అస్సాం కేంద్రంగా ఎస్ఎస్సీ నిర్వహించింది. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ 2018లో వచ్చింది.
2019 ఫిబ్రవరి 11, మార్చి 11 తేదీల మధ్య పరీక్ష నిర్వహించారు.కాగా, టైర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2019 డిసెంబర్ 12వ తేదీన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 21, 28 తేదీల్లో మార్కుల జాబితాను విడుదల చేయగా, తాజాగా ర్యాంకులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి వెబ్ సైట్ ద్వారా ఇండివిడ్యువల్ ర్యాంక్ తెలుసుకోవచ్చు. ఇందుకుగాను వెబ్సైట్లో డ్యాష్ బోర్డులోని రిజల్ట్/మార్క్స్ లింక్‌ను క్లిక్ చేయాలి. ఇకపోతే ఫలితాల విడుదల ఆలస్యం కావడానికి కారణం కరోనానే అని తెలుస్తోంది.
కొవిడ్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ టైంలో ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఆలస్యం అయినట్లు సమచారం. ఈ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కు 30,41,284 మంది అభ్యర్థులు అటెండ్ అయినట్లు బోర్డు పేర్కొంది. ఇందులో నుంచి 5,54,904 మంది మాత్రమే ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్‌కు క్వాలిఫై అయ్యారు. ఇకపోతే మెడికల్ ఎగ్జామినేషన్‌కు 1,52,226 మంది క్వాలిఫై కాగా ఇందులో మహిళలు 20,750 మంది పురుషులు 1,31,476 మంది. ఫైనల్ సెలక్టెడ్ క్యాండిడేట్స్‌కు ఎలాంటి విధులు ఉండబోతున్నాయి? ట్రైనింగ్ ఎన్ని రోజుల పాటు ఇస్తారు? పోస్టింగ్ ఎక్కడ? వంటి ఇతర విషయాలను నోటిఫికేషన్లో క్లియర్‌గా మెన్షన్ చేయగా, ఇంకా ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించొచ్చని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది.