టెన్త్ ప్యాస్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్.. రైల్వేలో 7914 ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే లో వివిధ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలని ఇప్పుడే చూసేద్దాం.

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో ఖాళీలు:

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఫిట్టర్‌, టర్నర్, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్, మెకానిక్‌, పెయింటర్‌, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్‌ మొదలైన పోస్టులు ఖాళీగా వున్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. వివరాలని https://www.rrcser.co.in/ లో చూడచ్చు.

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC):

జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా వున్నాయి. 2026 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివరాలని https://www.rrcser.co.in/ లో చూడచ్చు.

RRC SCR Apprentice రిక్రూట్మెంట్ 2023 :

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ లో వర్క్‌షాప్/యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల కోసం అప్లై చెయ్యచ్చు. మొత్తం 4103 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in/

Read more RELATED
Recommended to you

Latest news