పాఠశాల విద్యార్థులకు మంచి స్కాలర్ షిప్స్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..!

-

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మరియు మెరిట్ స్టూడెంట్స్ కి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం స్కాలర్షిప్స్ ని అందిస్తుంది. అయితే ఇక్కడ వాటిలో ఐదు స్కాలర్ షిప్స్ Scholarships గురించి ఉన్నాయి. మరి వాటి కోసం పూర్తిగా తెలుసుకోండి.

స్కాలర్ షిప్స్ /Scholarships
స్కాలర్ షిప్స్ /Scholarships

NMMS- National Means cum Merit Scholarship Exam:

ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళలో బాగా చదువుకునే వాళ్ళకి ప్రభుత్వం అందిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ ఇస్తారు. ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలి అనుకుంటే విద్యార్థి యొక్క కుటుంబ ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయల కంటే తక్కువ ఉండాలి.

అర్హత: ఏడవ తరగతి మరియు ఎనిమిదవ తరగతిలో 55 శాతం మార్కులు
స్కాలర్షిప్: 12000 రూపాయిలు సంవత్సరానికి
అప్లికేషన్ డెడ్లైన్: ఆగస్ట్ నుండి నవంబర్
అప్లికేషన్ మోడీ: ఆన్లైన్ అప్లికేషన్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అప్లై చెయ్యాలి.
వెబ్సైట్: https://scholarships.wbsed.gov.in/

NTSE – National Talent Search Exam :

ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంది. గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి చదువుకునే వాళ్ళు ఈ స్కాలర్షిప్ కి అర్హులు. స్టేట్ లెవెల్ మరియు ఆలిండియా లెవల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

అర్హత: పదో తరగతి
స్కాలర్షిప్: 1,250 రూపాయలు నెలకి
అప్లికేషన్ డెడ్లైన్: ఆగస్ట్ నుండి సెప్టెంబర్ వరకు
అప్లికేషన్ మోడ్: Liaison Officer of the concerned State or Union Territory
వెబ్సైట్ : https://scholarships.wbsed.gov.in/index.php

CBSE Single Girl Child Scholarship:

కుటుంబానికి ఒక ఆడపిల్ల ఉండి బాగా చదువుకుంటే అప్పుడు ఈ స్కాలర్షిప్ కి అర్హులు. ఆడ పిల్లలకి విద్యను ప్రోత్సహించాలి అనే ధ్యేయంతో ఈ స్కాలర్షిప్ ని తీసుకు రావడం జరిగింది. 11వ తరగతి లేదా 12వ తరగతి సీబీఎస్ఈ మోడల్ లో చదువుకునేవాళ్ళు దీనికి అర్హులు. అలానే వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజ్ 1500 దాటకుండా ఉంటేనే అప్పుడు ఈ స్కీం కి అర్హులు.

అర్హత: పదోతరగతిలో 60 శాతం మార్కులు
స్కాలర్ షిప్: 11వ తరగతి మరియు 12వ తరగతి లో చదువుకునేటప్పుడు నెలకు 500 రూపాయలు అప్లికేషన్ డెడ్లైన్: సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు
అప్లికేషన్ మోడ్: సీబీఎస్ఈ అఫీషియల్ వెబ్ సైట్ నుండి
వెబ్ సైట్: https://www.cbse.gov.in/Scholarship/Webpages/Guidelines%20and%20AF.html

Pre Matric Scholarship for Minorities:

50 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు దీనికి అర్హులు. కుటుంబ ఆదాయం లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి.

అర్హత: మైనారిటీ స్టూడెంట్స్
స్కాలర్షిప్: అడ్మిషన్ ఫ్రీ, ట్యూషన్ ఫీజు ఫ్రీ, మెయింటెనెన్స్ అలవెన్సు
అప్లికేషన్ మోడీ: నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్
వెబ్సైట్: https://scholarships.gov.in/

Pre-Matric Scholarship :

డిజాబిలిటీస్ వాళ్ళకి ఈ స్కాలర్షిప్ వస్తుంది. తొమ్మిదో తరగతి మరియు పదో తరగతి డిజాబిలిటీస్ స్టూడెంట్స్ ని చదివించాలనే దీన్ని తీసుకువచ్చారు. అయితే 40 శాతం మార్కులు వచ్చిన వాళ్ళు దీనికి అర్హులు. అదే విధంగా కుటుంబ ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. దీనికి అర్హులు అయిన వాళ్ళకి మెయింటెనెన్స్ అలవెన్సు, డిజాబిలిటీస్ అలవెన్స్ మరియు బుక్ గ్రాండ్ ఉంటుంది.

వెబ్సైట్: http://disabilityaffairs.gov.in/upload/uploadfiles/files/advertisement%20in%20hindi%202020-21.pdf
http://disabilityaffairs.gov.in/contenthi/page/scholarship-en.php

 

Read more RELATED
Recommended to you

Latest news