ఈ ఏడాది ఫ్రెషర్స్​కి పండగే.. ఐటీలో లక్షమందికి అవకాశం

ఉన్నవాళ్లకి జీతాలు పెంచడం కంటే, తక్కువ జీతానికి కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకోవడం బెటర్ అని చాలా కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అనుభవం ఉన్న వాళ్లకి ఎక్కువ వేతనం ఇవ్వాల్సి రావడం, డబుల్ సాలరీ కోసం కొంతమంది వేరే కంపెనీలకు జంప్ అవ్వడం వల్ల చాలా వరకు కంపెనీలు ఫ్రెషర్స్​ని రిక్రూట్ చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాదిలో ఫ్రెషర్స్ రిక్రూట్​మెంట్ బాగా పెరిగింది. ఇది చివరి ఆరు నెలల్లో మరింత పెరగనుందని టీమ్​లిజ్ ఎడ్​టెక్ రిపోర్ట్ వెల్లడించింది.

మొత్తం 59 శాతం ఎంప్లాయర్లు ఫ్రెషర్లను నియమించుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఈ నివేదికలో తేలింది. ఈ సంవత్సరం ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఎంప్లాయర్లు ఎంట్రీ లెవెల్‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు మొగ్గుచూపుతున్నారని, ఫ్రెషర్ల నియామకం గణనీయంగా పెరుగుతుందని టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ శాంతను రూజ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 14 లొకేషన్లలోని మొత్తం 18 ఇండస్ట్రీలకు చెందిన 865 కంపెనీల నుంచి డేటాను సేకరించి ఫ్రెషర్ల నియామకంపై ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను ‘కెరీర్ అవుట్‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌’ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.

ఐటీ, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌, టెక్నాలజీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, టెలికమ్యూనికేషన్స్ సెక్టార్లలో ఫ్రెషర్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదక వెల్లడించింది. ఐటీ, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలోని 65 % కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడంపై మొగ్గుచూపాయని, టెక్నాలజీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో 48 % కంపెనీలు, టెలికమ్యూనికేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47% కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. కెరీర్ అవుట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోంది.

ఈ ఏడాది సుమారు లక్ష మంది ఫ్రెషర్స్​ను ఐటీ కంపెనీలు నియమించుకుంటాయని.. టెలికాం కంపెనీలు కూడా దేశం మొత్తం మీద తమ డేటా సెంటర్లను విస్తరిస్తున్నాయని ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఉద్యోగ నియామకాలు ఊపందుకుంటాయని వివరించింది. సిటీల పరంగా చూస్తే ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకోవడంలో బెంగళూరు ముందుంది. ఈ సిటీలోని 68% ఎంప్లాయర్లు ఫ్రెషర్ల నియామకానికి మొగ్గు చూపారు. ముంబై (50 %), ఢిల్లీ (45 %) సిటీలలో కూడా ఫ్రెషర్ల హైరింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా జరగనుంది.

కస్టమర్లతో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇంటరాక్ట్ అయ్యే రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోంది. ఫెస్టివ్ సీజన్ స్టార్ట్‌‌ కానుండడంతో రెస్టారెంట్లు, హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో హైరింగ్ యాక్టివిటీ ఊపందుకుంది. ‘ ఫెస్టివ్ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పనిచేసేవారి కొరత ఏర్పడింది. ఈ ఏడాది మార్చి తర్వాత నుంచి హాస్పిటాలిటీ సెక్టార్ వేగంగా రికవరీ అయ్యింది. కొన్ని అంశాల్లో కరోనా ముందు స్థాయికి కూడా చేరుకుంది.

త్వరలో ఫెస్టివ్ సీజన్ కూడా ఉండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వినియోగం..రెండూ పెరుగుతాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ) ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కబిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూరి అన్నారు. ఈ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు లక్షల రెస్టారెంట్లు మెంబర్లుగా ఉన్నాయని.. పని తెలిసిన వారు దొరకడం లేదని, కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయిన చాలా మంది ఊరికి వెళ్లిపోవడమో లేదా ప్రొఫెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చేయడమో చేశారని సూరి అన్నారు. రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ట్యాలెంట్ ఉన్నవారు దొరకడం లేదని, ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా నియామకాలు ఊపందుకున్నాయని అన్నారు.