బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా బీజేపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ విషయంలో సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అప్పుడే వాస్తవాలు బయట పడతాయని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ విషయంపై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అమెరిక పర్యటనలో ఉన్న ఆయన న్యూజెర్సీలోని బహుజన విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో వారితో కలిసిన ఫోటోను షేర్ చేసి.. అమెరికాలో తమ నైపుణ్యాలకు సానబెడుతూ ఎంతో శ్రమిస్తున్న బహుజన బిడ్డలను కలుసుకున్నానని పేర్కొన్నారు. లక్షలాది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చేందుకు బీఎస్పీ కృషి చేస్తోందన్నారు. కానీ కొందరు దోపిడీ దొంగలు మాత్రం తమ పిల్లలను లిక్కర్ స్కామ్‌లో నిందితులుగానో.. దొడ్డి దారిన బీసీసీఐ కార్యదర్శులుగానో నియమిస్తున్నారని సెటైర్లు చేశారు.
అమెరికాలో తమ నైపుణ్యాలకు సానబెడుతూ ఎంతో శ్రమిస్తున్న మన బిడ్డలను ఈ రోజు న్యూ జెర్సీ రాష్ట్రంలో కలిసిన. ఇట్ల లక్షలాది బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకే #BSP శ్రమిస్తున్నది. దోపిడి దొంగలు మాత్రం, వాళ్ల పిల్లలను లిక్కర్ స్కాం నిందితులుగానో లేదా దొడ్డి దారిన BCCI కార్యదర్శులనో చేస్తరు. pic.twitter.com/JTDmUcRDys
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 23, 2022