ఎన్టీపీసీ లిమిటెడ్ లో ఖాళీలు… పూర్తి వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎన్టీపీసీ లిమిటెడ్ వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నిపుణులను నియమించుకోవాలని ఎన్టీపీసీ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల కి అప్లై చెయ్యడానికి చివరి రోజు మే 13, 2022.

jobs
jobs

దీని ద్వారా మొత్తం మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ 15 ఖాళీలను ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 3 సంవత్సరాల పాటు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖాళీల వివరాలను చూస్తే.. ఎగ్జిక్యూటివ్ (సోలార్ పీవీ) 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ (డేటా అనలిస్ట్) 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ (భూ సేకరణ/పునరావాసం & పునర్నివాసం) 9 పోస్టులు వున్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు careers.ntpc.co.inలో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక శాలరీ వివరాల లోకి వెళితే.. వేతనాలు ఎగ్జిక్యూటివ్ (సోలార్ PV) నెలకు రూ. 1,00,000, ఎగ్జిక్యూటివ్ (డేటా అనలిస్ట్) నెలకు రూ. 1,00,000, ఎగ్జిక్యూటివ్ (LA/R&R) నెలకు రూ. 90,000 చెల్లించనున్నారు. ఇక వయస్సు విషయానికి వస్తే వేరు వేరుగా పోస్టులకి వేరు వేరుగా వుంది.

వీటి వివరాలని నోటిఫికేషన్ లో చూసి తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్/ EWS/OBC కేటగిరీల అభ్యర్థులు రూ. 300 నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వ్రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అధికారిక వెబ్ సైట్: careers.ntpc.co.in