కేటీఆర్ వ్యాఖ్యలపై అశోక్ గజపతిరాజు స్పందించారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పు అంటారా? ఒక మంత్రి ఏమో జెనరేటర్ లు ఆన్ చేశాం అంటారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేసాం అంటారని మండిపడ్డారు. ఇదంతా ఎంటర్ టైన్ మెంట్ కి పనికొస్తాది తప్పా ఇంకేం కాదని.. వాస్తవానికి ఆంద్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం మరిచిపోయిందని అగ్రహించారు.
భాద్యతలను నిర్వహించడం మానేశారని.. ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఇలా చేసేది కాదని అగ్రహించారు. పిల్లల జీవితాలు, భవిష్యత్ తో ఆడుకుంటున్నారు.. సమర్ధవంతంగా పని చెయ్, అర్ధవంతంగా పని చెయ్ అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులకు సమన్లు ఇస్తుంటే ఇంకేమైనా అర్ధం ఉందా ? అని నిలదీశారు.
అసలు ఏమి జరిగుతుంది రాష్ట్రంలో. సమస్య తగ్గే విధంగా ఎక్కడైనా కృషి చేస్తున్నారా ? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకేలా భాద్యత నిర్వహించిందన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి కేంద్రం ఇవ్వకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు.