సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. వివ‌రాలు

-

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్‌. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాటగిరి లో ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో మొత్తం 74 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి నిన్న‌టి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తును స్వీకరిస్తోంది. నవంబర్ 21న దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 74
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 26
సెక్యూరిటీ ఆఫీసర్- 10
రిస్క్ మేనేజర్- 12
ఫైనాన్షియల్ అనలిస్ట్ / క్రెడిట్ ఆఫీసర్- 10
ఎకనమిస్ట్- 1
సీడీఓ / చీఫ్ డేటా సైంటిస్ట్- 1
డేటా అనలిస్ట్- 3
అనలిటిక్స్-సీనియర్ మేనేజర్- 2
డేటా ఇంజనీర్- 2
డేటా ఆర్కిటెక్ట్- 2
సీఏ / క్రెడిట్ ఆఫీసర్- 5

ముఖ్యమైన తేదీలు:
2019 అక్టోబర్ 30 – ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
2019 నవంబర్ 21 – ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ
2019 డిసెంబర్ 11 – కాల్ లెటర్స్ డౌన్‌లోడ్
2019 డిసెంబర్ 21 – ఆన్‌లైన్ ఎగ్జామినేషన్
ఫీజు వివరాలు – ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50, ఇతరులకు రూ.550.

Read more RELATED
Recommended to you

Latest news