కోల్‌ ఇండియా ఉద్యోగాలు.. 7 పాసైతే చాలు!

సెకండ్‌ కరోనా వేవ్‌ ఉధృతితో చాలా పరీక్షలు వాయిదా పడుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌ (ఈసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1086 సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అయితే, ఈ ఉద్యోగానికి కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ ప్రక్రియలో ఎంపికైన వారిని జనరల్‌ మేనేజర్‌ ఆఫీసులు, సీనియర్‌ మేనేజర్‌ ఆఫీసుల ఈసీఎల్‌ పర్సనల్‌ డిపార్టమెంట్‌ వద్ద నియమిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.easterncoal.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 1086
జనరల్‌– 842
ఎస్సీ– 163
ఎస్టీ– 81

అర్హతలు: అభ్యర్థులు ఏడో తరగతి పాసై ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి ఈ–మెయిల్‌ చేయాలి.
ఈ–మెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 15, 2021