నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేస్ లో 3591 ఖాళీలు…!

-

నిరుద్యోగులకి శుభవార్త. ఉద్యోగం కోసం చూస్తున్నారా…? ఇండియన్ రైల్వేస్ లో అవకాశం ఉంది. కొన్ని కాళీలని భర్తీ చేయడానికి ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ పోస్ట్స్ ని భర్తీ చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు 11 గంటలకు మొదలవుతుంది. ఈ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకునే వాళ్లు పదవతరగతి గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలి.

అప్లై చేసుకోవడానికి 24 జూన్ 2021 ఆఖరి తేదీ. ఇక ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయానికి వస్తే… 3591 కాళీలు ఉన్నాయి. కార్పెంటర్, ఎలక్ట్రిషన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్మెన్, డైస్ వెల్డర్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేటర్ ఏసీ మెకానిక్ మొదలైన ఖాళీలు ఉన్నాయి.

https://www.rrc-wr.com/ ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. 15 నుండి 24 ఏళ్ళ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలని https://www.rrc-wr.com/rrwc/Act_Appr_2021-22/Apprentice_2021-22_Notification.pdf లో చూడచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: Indian Railway rrc-wr.com

Read more RELATED
Recommended to you

Latest news