ఇండియా పోస్ట్ లో ఖాళీలు.. 81 వేల రూపాయల వరకు జీతం..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. పంజాబ్ పోస్టల్ సర్కిల్ పలు రకాల పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

National Savings Certificate
National Savings Certificate

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మొత్తం 57 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ ద్వారా మనకి తెలుస్తోంది. అప్లై చేసుకోవడానికి 18 ఆగస్టు ఆఖరి తేదీ. ఇక పోస్టులు వివరాల్లోకి వెళితే… పోస్టల్ అసిస్టెంట్ 45 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ 9 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మూడు పోస్టులు వున్నాయి.

గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పన్నెండవ తరగతి పూర్తి చేసిన వాళ్ళు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు. అదే విధంగా అభ్యర్థులుకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ బోర్డు లేదా ఇతర ఏ విధమైన బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అర్హత చూస్తే.. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అదే విధంగా ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు వయస్సు 18 నుండి 27 ఏళ్లు ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అయితే 18 ఏళ్ల నుండి 25 ఏళ్లు ఉండాలి. ఇక శాలరీ విషయంలోకి వస్తే.. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కి 25,500 నుండి 81,100 వరకు ఇవ్వనున్నారు,. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అయితే 18 వేల రూపాయల నుండి 56,900 వరకు వస్తాయి. indiapost.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.