మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అనంతపురం లోని సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. దీనిలో మొత్తం 13 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఇక మనం అర్హత వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకి అప్లై చేసుకునే వారు డిగ్రీ తో పీజీడీసీఏ లేదా బీఎస్సీ(కంప్యూటర్స్) ని పూర్తి చేసి ఉండాలి. లేదంటే బీకాం(కంప్యూటర్స్)/ బీటెక్(కంప్యూటర్స్)/ ఎంసీఏ అయినా సరే పూర్తి చేసి ఉండాలి.
ఇక మనం వయస్సు విషయానికి వస్తే.. అప్లై చేసుకునే వారి వయస్సు 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం గురించి చూస్తే.. టెక్నికల్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 14-12-2022. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. ఆఫ్ లైన్ ద్వారా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి వుంది. కింద వున్నా చిరునామాకు దరఖాస్తులను పంపాల్సి వుంది.
చిరునామా: డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ కార్యాలయం, అనంతపురం.