బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్ష రూపాయలు జీతం..!

-

బ్యాంక్ ఉద్యోగాలను వైట్ కాలర్ జాబ్స్ అంటారు. బ్యాంక్‌లో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ.. దాన్ని సాకారం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. బ్యాంకులో జాబ్ చేయడం మీ కల అయితే.. ఈ జాబ్ మీకు సరిపోతుందో చెక్ చేసుకోండి. ప్రభుత్వరంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రాడక్ట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీఏ లేదా పీజీడీఎం చదివిన వారు ఈ ఉద్యోగానికి అప్లయి చేసుకోవచ్చు.

jobs notification in bank of baroda

స్టార్టింగ్ శాలరీనే లక్ష రూపాయలు ఉంటుంది. అంటే సంవత్సరానికి 12 లక్షల రూపాయలు అన్నమాట. ఆఫర్ టెంప్టింగ్‌గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లయి చేయాలనుకుంటే.. www.bankofbaroda.co.in వెబ్‌సైట్‌కు వెళ్లి careers సెక్షన్‌ను క్లిక్ చేసి అప్లయి చేసేయండి.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫిబ్రవరి 25నే ప్రారంభమయింది. మార్చి 18 వరకు మీరు అప్లయి చేసుకోవచ్చు. 28 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య ఉన్నవాళ్లు ఈ పోస్ట్‌కు అప్లయి చేసుకోవచ్చు. ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయలు.

ప్రొడక్ట్ మేనేజర్-శాలరీ పోర్ట్‌ఫోలియో- 1, ప్రొడక్ట్ మేనేజర్-మర్చెంట్ అక్విజిషన్ బిజినెస్- 1, ప్రొడక్ట్ మేనేజర్-కరెంట్ అకౌంట్- 1, ప్రొడక్ట్ మేనేజర్-సేవింగ్ అకౌంట్- 1, ప్రొడక్ట్ మేనేజర్-డీమ్యాట్/ట్రేడింగ్ అకౌంట్- 1, ప్రొడక్ట్ మేనేజర్-గవర్నమెంట్/పీఎస్‌యూ బిజినెస్- 1.. ఖాళీలను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా భర్తీ చేయనుంది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ లో ఉన్న నోటిఫికేషన్ ను చూడొచ్చు.

ఈ విలువైన స‌మాచారం మీకు ఉప‌యోగం ఉన్నా లేక‌పోయిన‌ మీ మిత్రుల‌కు, బంధువుల‌కు ఏవ‌రికైనా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు ద‌య‌చేసి షేర్ చేయండి

Read more RELATED
Recommended to you

Latest news