ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా సరే మళ్లీ టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు.
అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతుండగా.. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి కూడా వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదివరకే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే విషయమై పత్రికా ప్రకటనను రిలీజ్ చేశారు.
నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే..
తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్ పారటీలో చేరుతున్నట్టు ఆయన ప్రెస్ నోట్‌లో తెలిపారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా సరే మళ్లీ టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు..
ఇటీవల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారని లింగయ్య స్పష్టం చేశారు. అయినా.. కాంగ్రెస్ నాయకుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. అభివృద్ధికి సహకరించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుల పద్ధతి సరైంది కాదని… కాంగ్రెస్ నాయకుల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం ఉందన్నారు. అందుకే ఆయనకు అఖండ విజయం లభించిందని స్పష్టం చేశారు.
చిరుమర్తి లింగయ్య పత్రికా ప్రకటన ఇదే..