మరో ప్రవేశ పరీక్ష వాయిదా!

-

కరోనా కేసుల తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో అందరికీ వాక్సిన్‌ కూడా అందలేదు. దాదాపు ఈ ఏడాది గడవాల్సిందే, అందరికీ టీకా అందాలంటే! ఈ తరుణంలో ఒకదాని తరువాత మరొక పరీక్షలు వాయిదా పడుతునే ఉన్నాయి. తాజాగా టీజీసెట్‌ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ నెల 30 న జరగాల్సిన టీజీసెట్‌ను వాయిదా వేశారు.

త్వరలో మళ్లీ నొటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహించే టీజీసెట్‌–2021 కూడా వాయిదా పడింది. కొవిడ్‌ కారణంగానే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. దీంతో మే 30 ఆదివారం జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా పడింది. గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీసెట్‌–2021 నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. టీజీసెట్‌ పరీక్షకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌: WWW.TGCET.GOV.IN  తెలుసుకోవచ్చు. ప్రవేశాలకు సంబంధించి సందేహాల పరిష్కారానికి 040–23120431, 040–23120432 అనే నంబర్లలలో సంప్రదించవచ్చన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news