అక్కడ వారానికి మూడు రోజులు ఆఫ్.. ఇండియాలో వర్కౌట్‌ కాదంటున్న నిపుణులు..! 

-

ఒకప్పుడు వారానికి ఆరు రోజులు పని.. ఒకరోజు మాత్రం సెలవు ఉండేది.. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు రెండు రోజులు సెలవులు ఇచ్చి.. ఐదు రోజులు పని చేయించుకుంటున్నాయి. నిజానికి వారంలో రెండు రోజులు ప్రశాంతంగా ఏ వర్క్‌ లేకుండా ఉండటం బాగుంటుంది. కానీ ఇప్పుడు చాలామందికి.. ఆ రెండు రోజులు కూడా సరిపోవడం లేదు. మూడు రోజులు ఆఫ్‌ ఇస్తే బాగుండు అనుకుంటారు. మన దగ్గర ఇంకా ఈ కాన్సప్ట్ తేలదేు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా వారానికి నాలుగు రోజులు పని మూడు రోజులు వీకాఫ్‌ ఉండాలనే కాన్సప్ట్‌ నడుస్తోంది. మరీ అవి ఏం కంపెనీలు… ఇలా వీకాఫ్స్‌ ఇవ్వడానికి రీజన్‌ ఏంటో చూద్దామా..!

తాజాగా బ్రిటన్‌ కంపెనీలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్‌ చేశాయి. లండన్‌లోని ప్రెషర్ డ్రాప్ బ్రూవరీ ఉద్యోగులు… 6 నెలలపాటూ ట్రయల్ కింద వారానికి 4 రోజుల పని విధానాన్ని ప్రారంభించారు. వారితోపాటూ… బ్రిటన్‌లోని 60 కంపెనీల్లో 3వేల మంది ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

శాలరీలో నో చేంజ్..

ఈ విధానంలో ఉద్యోగులకు ఒక రోజు పని దినాన్ని తగ్గించినా… శాలరీలో మాత్రం మార్పు లేదు. కంపెనీలే తమ రెవెన్యూలను త్యాగం చేస్తున్నాయి. ఇలాంటి ట్రయల్స్… స్పెయిన్, ఐస్‌లాండ్, అమెరికా, కెనడాలో కూడా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఆగస్ట్ నుంచి ప్రారంభించాలి అనుకుంటున్నాయట.

ఎందుకు అలా..? లాభం ఏంటి..?

టొట్టెన్‌హామ్ హాలేలోని ప్రెషర్ డ్రాప్ కంపెనీ… దీనివల్ల తమ ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెబుతోంది. 3 రోజులు వీకాఫ్స్ ఇస్తున్నారనే ఉద్దేశంతో ఉద్యోగులు ఇదివరకటి కంటే ఉత్సాహంగా పనిచేస్తారట. అంతేకాకుండా.. వారి ఆరోగ్యం మెరుగవుతుందనీ, కాలుష్యం తగ్గుతుందని చెబుతోంది. ఇది కంపెనీ అంచనా మాత్రమే. వాస్తవ ఫలితాలు ఆరు నెలల తర్వాత తెలుస్తాయి. ఆ ఫలితాల్లో ఇది కలిసొస్తోంది అనుకుంటే… కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయట.

విదేశాలకు మేలే..

ఇండియా లాంటి దేశాలకు ఇది అంతగా కలిసిరాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. విదేశాల్లో ప్రజలు.. వారంలో 5 రోజులు పనిచేసి.. మిగతా 2 రోజులూ ఇళ్లలోనే ఉండిపోకుండా.. వీకెండ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. తద్వారా వాళ్లు.. భారీగా ఖర్చు పెడతారు. అక్కడ సేవింగ్స్ చాలా తక్కువ. ఫలితంగా నగదు ప్రవాహం అనేది ప్రజల మధ్య కొనసాగుతుంది. అది దేశ అభివృద్ధికి మేలు చేస్తుంది..
కానీ మన దగ్గర పరిస్థితి వేరు..ఇండియా లాంటి దేశాల్లో చాలా మంది ఉద్యోగులు వీకాఫ్ నాడు కూడా ఇళ్లలోనే ఉంటారు. టీవీల్లో సినిమాలూ చూస్తూ గడిపేస్తారు. కొద్దిమంది మాత్రమే బయటకు వెళ్తుంటారు. పైగా ఇండియన్స్‌కి సేవింగ్స్ అలవాటు ఎక్కువ. డబ్బును ఎంజాయ్‌మెంట్ కోసం ఖర్చు పెట్టేవాళ్లు చాలా తక్కువ శాతం మంది ఉంటారు.. అందువల్ల ఉద్యోగుల వల్ల వీకెండ్‌లో నగదు ప్రవాహం అనేది ఇండియాలో పెద్దగా ఉండదని నిపుణుల అభిప్రాయం. ఇండియాలో వారానికి 4 రోజులే పనిదినాలు ఉంటే… అది కలిసిరాదనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇంతకీ మీరేమంటారు..? మనకు కూడా నాలుగు రోజు పనిదినాలు.. మూడు రోజులు ఆఫ్‌ ఇస్తే బాగుంటుందంటారా..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news