లక్షల మంది కాంపిటీటివ్ పరీక్షలు రాస్తూ ఉంటారు. అయితే మాక్ టెస్ట్ mock test ముందు రాయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎందుకు మాక్ టెస్ట్ అంత ఉపయోగకరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పరీక్షల్లో ప్రశ్నల పై అవగాహన వస్తుంది:
మాక్ టెస్ట్ రాయడం వల్ల పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు అనేది తెలుస్తుంది. పరీక్షలో ఇచ్చే ప్యాటర్న్, సిలబస్ ఎంత కష్టంగా ఉంటుంది అనే విషయాలు తెలుస్తాయి. దీంతో పరీక్ష రాసే వారికి చాలా అవగాహన కలుగుతుంది.
ప్రిపరేషన్ మరియు పర్ఫామెన్స్ గురించి చెప్తుంది:
మాక్ టెస్ట్ వల్ల ఏ టాపిక్ మర్చిపోతున్నారు ఎటువంటి వాటిపై మీకు ఇంకా పట్టు కలగాలి. మీరు చదివే దానిని ఎలా రాస్తున్నారు, అదే విధంగా సిలబస్ కి రివిజన్ కూడా అవుతుంది.
పరీక్ష వ్రాసే పద్ధతి:
మాక్ టెస్ట్ వల్ల మీరు ఏ విధంగా పరీక్ష రాస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది. మాక్ టెస్ట్ అనేది ఒక ఎక్స్పరిమెంట్ లాగా మీకు ఉంటుంది. దీంతో పరీక్షలో మీకు బాగా వచ్చిన విధానాన్ని మీరు బాగా వ్రాసే పద్ధతిని అనుసరించవచ్చు.
సమయం విలువ తెలుస్తుంది:
మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీకు మీరు ఉపయోగించే సమయం గురించి తెలుస్తుంది. మీరు ఎంత వేగంగా చేస్తున్నారు లేదా ఎంత నెమ్మదిగా చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దీంతో మీరు పరీక్షలు ఎంత సమయాన్ని దేనికి కేటాయించవచ్చు అనే విషయాలు తెలుస్తాయి.
మీరు ఏ టాపిక్ లో దిట్ట అనేది తెలుస్తుంది:
మీరు ఒకసారి మాక్ టెస్ట్ రాస్తే దాని ద్వారా మీరు ఏ సెక్షన్ ని బాగా రాయగలుగుతారు. ఏ సెక్షన్లో వీక్ గా ఉన్నారు అనేది తెలుస్తుంది. మీరు మీకు రాలేని టాపిక్స్ పై మరింత శ్రద్ధ పెట్టి పరీక్షలో బాగా రాయచ్చు.
భయం తగ్గుతుంది:
సాధారణంగా పరీక్ష అంటే ఎంతో అంత భయం ఉంటుంది. అయితే మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అలవాటైపోతుంది. దీనితో పరీక్ష రాసేటప్పుడు మీరు ప్రశాంతంగా రాయచ్చు.
మీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయొచ్చు:
మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీరు చేసే తప్పుల్ని మళ్ళీ తిరిగి చేయకుండా బాగా చదువుకో వచ్చు. అదే విధంగా మీరు ఎంత స్కోర్ చేయగలరు అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ఇలా మాక్ టెస్ట్ వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి.