విభిన్న భౌతిక స్వరూపాలతో రూపుదిద్దుకున్న భారత దేశ చరిత్ర ఇదే..

-

ఈ భూ ప్రపంచంలో కల్లా చాలా అందమైన సువిశాలమైన ప్రదేశాలలో ఒకటి భారత దేశం.ఎన్నో రకాల కుల,మతాలకు అతీతమైన దేశంలో అందాలతొ పొదిగి ఉన్న ఎన్నో అందమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.. భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణస్థితులలో ఎన్నో వైవిధ్వతలకు కారణమవుతుంది.భారతదేశానికి 82030 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. భార తదేశ ప్రామాణిక కాలమానానికి దీనినే ఆధారంగా తీసుకుంటారు.
ప్రపంచ భూ భాగమంతా రెండు ప్రధాన భూ ఖండాలు నుంచి ఏర్పడ్డాయి. ఇవి అంగారాభూమి, గోండ్వానా భూమి. భారతదేశం గోండ్వానా భూ భాగంలో ఉంది.హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె భారతదేశానికి ఉత్తరాన వ్యాపించి వున్నాయి. ఇవి పడమర నుంచి తూర్పుకి 2400 కి.మీ. పొడవు ఉన్నాయి. మూడు పర్వత శ్రేణులు ఉన్నాయి. ఉత్తరాన ‘ఉన్నత హిమాలయాలు’ లేదా ‘హిమాద్రి’ పర్వత శ్రేణి ఉంది. ఇది మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమానీ నదులు కలవు. ఇది జీవనదులకు నీటిని అందిస్తున్నాయి.

హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ‘నిమ్న హిమాలయాలు’ అంటారు. వీటిని ‘హిమాచల్’ అని పిలుస్తారు. ఈ శ్రేణిలో పిర్పంజాల్, మహాభారత పర్వత శ్రేణుల కలవు.హిమాలయాల్లో దక్షిణాన ఉన్న శ్రేణిని ‘శివాలిక్ శ్రేణి’ అంటారు. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ప్రసిద్ధి గాంచిన ‘డెహ్రాడూన్, కోట్లిడూన్, పాట్లిడూన్’ లు కలవు. తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా వున్న హిమాలయాలను ‘పూర్వాంచల్’ అంటారు.వీటివల్ల భారతదేశ శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇది దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటున్నాయి.

భారతదేశంలోని ‘రుతు పవన తరహా శీతోష్ణస్థితి’ కి హిమాలయాలే కారణం. హిమాలయాలు లేకపోతే, ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. హిమాలయ నదులు కిందకి తె చ్చే ‘బండ్రు మట్టి’ వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారమంతంగా మారాయి.హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర,వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాలలో సారవంతమైన ‘అంతర్వేదులు’ కలవు. రెండు నదుల మధ్య ప్రాంతం ‘అంతర్వేది’ అంటారు.

హిమాలయ నదులు కిందకి ప్రవహించే రాళ్లు, గులక వంటి వాటిని శివాలిక్ పర్వత పాదాలచెంత సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. వీటినే ‘భాబర్’ అంటారు.సచ్ఛిద్రంగా ఉండే నదులు, వాగుల వల్ల ఏర్పడిన చిత్తడి నేలలను ‘టేరాయి’ ప్రాంతం అంటారు.దేశానికి మూడువైపుల సముద్రాలు ఉన్నాయి కాబట్టి దీనిని ‘ద్వీపకల్ప పీఠ భూమి’ అని కూడా అంటారు. ఇది పురాతన స్ఫటికాకార, క ఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో నిర్మితమైనది.దక్కన్ పీఠభూమి పడమర నుంచి తూర్పుకు వాలి ఉంది. గూడ లూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ప్రఖ్యాతి గాంచిన వేసవివిడిది ‘ఉదక మండలం’ (ఊటి) నీలగిరి పర్వతాలలో ఉంది. ఈ పర్వతాలలో ఎత్తై శిఖరం దొడబెట్ట(2637 మీ..). భారతదేశంలో అన్నావులై కొండలలోని ‘అనైముడి’(2695 మీ.) ఎత్తై శిఖరం.

ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వర కు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలలో ఎత్తై పర్వతం అరోమ కొండ చింతపల్లి దగ్గర ఉంది.ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. రాజస్థాన్లోని అధిక భాగం ఈ ఏడారి విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అంతస్థలీయ ప్రవాహంగా వున్న నది ‘లూని’.తూర్పు తీర మైదానం ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులో కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులతో ఏర్పడిన ఈ మైదాన ప్రాంతాలు మిక్కిలి సారవంతమైనది.భారతదేశ ద క్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది…ఇవి లక్ష దీప దీవుల వల్ల ఏర్పడ్డాయి.

మన దేశంలో ఎన్నో జీవనదులు కూడా ఉన్నాయి. హిమానీన దాల నుంచి నీళ్లు అందుట వలన హిమాలయ నదులు సంవ త్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి.భూ భాగం మూడు వైపుల నీటితో సరిహద్దుగా వుండి ఒక వైపు ప్రధాన భూభాగం క లిగి ఉంటే దానిని ద్వీపకల్పంగా వ్యవ హారిస్తారు. భారతదేశానికి మూడు వైపుల సముద్రాలతో కూడిన తీర ప్రాంతం కలదు. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూమహాసముద్రం కలవు. భారతదేశం ఒక ద్వీపకల్పం..

*. ఇకపోతే నిరంతరం సంవత్సరం పొడవుగా నీరు కలిగి వుండి ప్రవహించు నదులు జీవనదులు. హిమానీన దాల నుంచి నీళ్లు అందుట వలన హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి.

*. మూడు వైపుల నీటితో సరిహద్దుగా వుండి ఒక వైపు ప్రధాన భూభాగం క లిగి ఉంటే దానిని ద్వీపకల్పంగా వ్యవ హారిస్తారు. భారతదేశానికి మూడు వైపుల సముద్రాలతో కూడిన తీర ప్రాంతం కలదు. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూమహాసముద్రం కలవు. భారతదేశం ఒక ద్వీపకల్పం.

*. ప్రపంచ భూభాగమంత రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి అంగారాభూమి, గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగం లోనిది.

*.  అంగారాభూమిని లారేసియాగా పిలుస్తారు. యూరేషియా ఖండ ఫలకం అధిక భాగం లారేసియా.

*.  పాంజీయాలోని విడిపడిన ప్రధానమైన భూఖండం అంగారాభూమి. భారతదేశ ద్వీపకల్పం ఫలకం ఈశాన్య దిశగా పయనించి యురేషయా ఫలకం (అంగారా భాగం)తో ఢీ కొంది.

*.  నిమ్మ హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా ‘డూన్’ అంటారు. వీటిలో కొన్ని ప్రసిద్ధి గాంచిన డూన్‌లు. డెహ్రాడూన్, కోట్లి డూన్, పాట్లి డూన్ మొదలైనవి.

*.  హిమాలయాల్లో అన్నిటి కంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. ఈ పర్వతాలను జమ్ము ప్రాంతంలో జమ్ము కొండలు అనీ, అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మికొండలు అనీ, అస్సాంలో కచార్ అనీ రకరకాల పేర్లను కలిగి ఉంటుంది..తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ‘పూర్వాంచల్’ అంటారు. ప్రాంతీయంగా వీటిని పాట్‌కాయ్ కొండలు, నాగాకొండలు, మణిపురి కొండలు, ఖాసికొండలు, మిడో కొండలుగా పిలుస్తారు..

*. సముద్ర గర్భంలో సున్నం, కార్బన్‌లతో సమ్మిళితంగా ఏర్పడు నీటి నిర్మాణాన్ని ‘కోరల్’ అని పిలుస్తారు. ఇది సముద్ర గర్భ జీవజాలానికి నిలయంగా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news