ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖం.. గెలుపు, ఓటమి ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ సాధారణం. ఒకసారి మనం గెలిస్తే ఒకసారి ఓడిపోతూ ఉంటాం. గెలిస్తే మన యొక్క ప్రతిభ మనకి అర్థమవుతుంది అలానే ప్రశంసలు కూడా దక్కుతాయి. ఇలా ఎలా అయితే గెలుపు వల్ల మనకి కొన్ని వస్తున్నాయో.. ఓటమి వల్ల కూడా మనం కొన్నిటిని పొందొచ్చు. అయితే ఓటమి వల్ల నిజానికి ఎన్నో నేర్చుకోవచ్చు.
మన బలహీనత తెలుసుకోవడానికి అవుతుంది. దానిని మనం మళ్ళీ రిపీట్ చేయకుండా గెలవడానికి అస్త్రంగా వాడుకోవచ్చు. చాలామంది ఓడిపోయి అనవసరంగా కుమిలిపోతూ ఉంటారు. ఓటమి ఎదురైంది అని పదేపదే బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి అది మంచి పని కాదు. గెలుపోటములు రెండూ వస్తూ ఉంటాయి. వీటి నుండి కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవాలి.
నిజానికి ఓటమి అనేది ఓడిపోవడం కాదు ఓటమి నుండి నేర్చుకోకపోవడం అనేది నిజమైన ఓటమి. ఎప్పుడైనా సరే ఏదైనా ఓటమి ఎదురైతే మీరు ఎక్కడ తప్పు చేశా…రు ఏ విధంగా దాన్ని సరిచేసుకోవాలి… గెలుపుని ఎలా పొందాలి అనేది చూసుకుంటూ ఉండాలి. తిరిగి మళ్లీ అదే తప్పు చేయకుండా దానిని బలంగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అయితే చాలా మంది ఓటమిని భరించలేరు.
ఓటమి ఎదురైతే ఇది నాది కాదు అన్నట్లు వదిలేస్తారు. ”ఓడిపోవడం నిజమైన ఓటమి కాదు. కానీ ఓటమి నుండి నేర్చుకోకపోవడమే నిజమైన ఓటమి” అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఓటమి ఏదో ఒకరోజు ఎదురవుతూ ఉంటుంది. దానిని కూడా స్వీకరించాలి. అంతేకానీ గెలుపొందితేనే ఆనందిస్తాను.. ఓటమిని అంగీకరించను అనడం తప్పు.
రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ ఉండాలి. కానీ ఓటమి నుండి నేర్చుకోకుండా మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే మళ్లీ ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అనుసరించి.. సక్సెస్ ని పొందండి. ఓటమి నుండి కూడా నేర్చుకుని మంచిగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి.