‘మూడు’తోనే ఎన్నికలు.. వైసీపీకి ప్లస్సేనా!

-

అసలు గత ఎన్నికల్లో ఎవరూ కూడా రాజధాని మార్పు అనే అంశాన్ని ఊహించి ఉండరు. విడిపోయిన రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది..దానికి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా మద్ధతు ఇచ్చింది. అలాగే అక్కడ చంద్రబాబు గ్రాఫిక్స్ చేసి చూపించినా సరే…కొద్దో గొప్పో పనులు మాత్రం జరిగాయి. సరే ఎన్నికలు వచ్చాయి..ఆ ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ గెలిస్తే రాజధాని పనులు పూర్తి అవుతాయని అనుకున్నారు. అలాగే జగన్ గెలిచినా సరే రాజధాని పనులు చేస్తారని జనం నమ్మారు.

అసలు ఎట్టి పరిస్తితుల్లోనూ ఏ ప్రాంత ప్రజలైన సరే రాజధాని మార్పు గురించి ఆలోచన చేయలేదు. పైగా ఎన్నికల సమయంలో జగన్ గెలిస్తే రాజధాని మారుస్తారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలని తిప్పికొడుతూ..జగన్ రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటున్నారని, రాజధాని ఎక్కడికి వెళ్లదని అప్పుడు వైసీపీ నేతలు మాట్లాడారు. సరే ఏదైనా గాని జనం జగన్‌ని నమ్మారు..గెలిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జగన్..అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు.

ఈ ప్రకటనకు అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఉద్యమం మొదలుపెట్టారు. ఒకటే రాజధాని ఉండాలని, అది అమరావతి అని వారు ఇప్పటికీ పోరాడుతున్నారు. ఇటు టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు అమరావతికే సపోర్ట్ ఇస్తున్నారు. ఒక్క వైసీపీ మాత్రం మూడు రాజధానులు అంటుంది. ఎన్నికల్లోపు ఎలాగైనా మూడు రాజధానులు పెడతామని చెబుతున్నారు.

అలాగే మూడు రాజధానులు రిఫరెండంగానే ఎన్నికలకు వెళ్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అలా వెళితే వైసీపీకి లాభం ఉంటుందా? నష్టం ఉంటుందా? అనేది క్లారిటీ లేదు. పూర్తిగా లాభమైతే ఉండదని గట్టిగా చెప్పొచ్చు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో నష్టం జరగొచ్చు. అయిన ప్రజలు కూడా రాజధాని రిఫరెండంగా చూస్తే ఎలా తీర్పు ఇస్తారో అర్ధం కాకుండా ఉంది. మరి ప్రజలు ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news