నవ్వుతూ ఉండేవారి వద్ద బాధలు వుండవు అనుకోవడం పొరపాటే..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో రెండు కోణాలు ఉంటాయి. అదే కష్టం, సుఖం ఈ రెండూ కూడా శాశ్వతం కాదు. ఓ నాడు కష్టం ఉంటే ఓ నాడు సుఖం ఉంటుంది. పదే పదే బాధలు ఉన్నాయని కుంగిపోవడం మంచిది కాదు. ఈ రెండూ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి జీవితంలో మీరు అలా సర్దుకుని వెళ్ళి పోవాలి. అంతే కానీ కష్టాలు మీకే వస్తున్నాయని తెగ బాధపడి పోకూడదు.

 

ఇక ఇది ఇలా ఉంటే కొంత మంది జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూ ఉంటారు. నిజానికి ఆ బాధ తట్టుకోలేనప్పటికీ కూడా వారు ఎవరితో మాట్లాడినా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. అసలు కనీసం కన్నీళ్ళని కార్చరు. బాధలు చెప్పుకోరు. ఇలాంటి వాళ్లు వాళ్ల బాధను ఇతరులతో చెప్పుకోరు. షేర్ చేసుకోవడం కూడా వారికి నచ్చదు.

వారికి మానసిక గాయాలు ఉన్నప్పటికీ బయటకి వాటి గురించి చెప్పరు. అలాంటి వ్యక్తులు కనుక మీ జీవితంలో ఎదురైతే వారిని మీరు జాగ్రత్తగా ఎదుర్కోండి. ధైర్యం చెప్పండి. ఎటువంటివి మాట్లాడితే వాళ్లు బాగా బాధ పడతారో తెలియదు కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. జీవితమంటే అన్నీ కలగలిసి ఉంటాయి. పైకి వారు ఆనందంగా కనపడినప్పటికీ వారికి ఏ బాధ లేదు అనుకోవడం మన భ్రమ.

అందరికీ బాధలు ఉంటాయి అయితే అందరూ షేర్ చేసుకోడానికి ఇష్టపడరు కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులను చూసి ఏడవద్దు పైగా వారికి బాధలు ఏమీ లేవని మీరు అనుకుని వారి జీవితాన్ని చూసి నా జీవితం ఇలా లేదు ఎందుకు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఎన్నో ఇబ్బందులు… బాధలు ఉంటాయి కొంతమంది ఆనందాన్ని పంచుకుంటారు తప్ప బాధలను పంచుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news