మార్నింగ్ రాగా : ఎరైవ‌ల్ ఆఫ్ హ్యాపెనింగ్స్  

-

మ‌నుషులే కాదు ప్ర‌కృతి కూడా ప్యానిక్ మ‌న కార‌ణంగా.. రోగ గ్ర‌స్త కార‌కాల‌ను నిలువ‌రించ‌డం బాధ్య‌త. రోగ గ్ర‌స్త జీవుల‌ను గుర్తించ‌డం నివారించ‌డం సైన్సు తీసుకోవాల్సిన బాధ్య‌త. తీసుకుంటుంది. కానీ మ‌నిషేం చేస్తున్నాడ‌ని? ఎందుక‌ని ఇన్ని జీవుల చ‌ల‌నాన్నీ, జీవిత కాలాన్నీ నిలువ‌రిస్తున్నాడ‌ని….డికంపోజ్ ద లాంగ్వేజ్ ..ఏమో ! రాస్తున్న వాడెవ్వ‌డూ..న‌చ్చ‌డు..డు డు డు ..డు ము వు ..అయితే ప్ర‌థ‌మం లేదా ప్ర‌ళ‌యం. మ‌ర‌ణ సంబంధ విష‌యాల‌ను మోస్తున్న కొద్దీ లేదండీ చావు భ‌యం మోస్తున్న కొద్దీ క‌ట్టెల విలువ, అడ‌వి విలువ విస్తృతం అవుతోంది.

ఉమ్మ‌డి చావు ఊరుమ్మ‌డి బ‌తుకు ఉమ్మ‌నీటి రాత
రెండూ లేదా మూడూ బాగున్నాయి
కానీ బ‌తుకును ఇంకాస్త చావ‌నిద్దాం
బీ బ్రేవ్ .. ఒక పుల్ల‌టి తేన్పు ఒక పుక్కిట పురాణం కూడా
అచ్చ‌మ‌యిన అచ్చం కాని స్వ‌చ్ఛ‌మ‌యిన స్వ‌చ్ఛం కాని లిపి కూడా

హా హా హా తెలివి ..మ‌నుషులే ఎందుకు ..ప్యానిక్ ..హా హా మ‌న కార‌ణంగా..ప్ర‌కృతి కూడా ! విడిచిన ఏకాంతాల్లో నిర్ణిద్ర ఒక‌టి వెన్నాడి ఊహాల క‌ల్లోలాల‌ను విశ్లేషించిన తీరే ఇప్ప‌టి జ్ఞాప‌కం నాలో.. క‌రోనా మ‌నుషులను చంప‌దు..క‌రోనా కార‌కాలే మ‌నుషుల‌ను చంపుతాయి. కార‌కం వేరు..కార‌ణం వేరు.కానీ మ‌నుషుల‌ను ఏ ద‌రిద్రం వెన్నాడితే..అది గ్లామ‌ర‌స్ వెర్ష‌న్ లోకి వ‌స్తుంది.క‌నుక ముందు ఈ క‌రోనాను డీ గ్లామ‌రైజ్ చేయండి..బాగుంటుంది.

మ‌నిషి అడ‌విలో పుట్టేడు..ఈ జీవం ఆ జాలం అంతా కూడా అంత‌ర్థానం అయ్యేందుకు! ఈ మృత్యు మ‌హ‌మ్మారిని ప్రేమిస్తాను..అందుకు త‌గ్గ‌వేవో నాలోనూ ఉన్నాయి. చావుల వ్యాపారులు పోగేసుకున్న కోట్లు వెనుక ర‌హ‌స్యాలు ఉన్నాయి. అవి విచ్ఛేదితం కానంత వ‌ర‌కూ ఎవ‌డి చావు వాడే చావాలి. వెన్ ద పీపుల్  హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ..ఐ ఫీల్ వెరీ హ్యాపీ ..కానీ రాత‌లోనూ తాగే రా లోనూ ఏదో ద‌రిద్రం ఉంది. అందుకే మృత్యు మ‌హ‌మ్మారులు అర్థం కాకుండా పోతున్నాయి. ముందు ఆ శ‌వాన్ని ప‌రీక్షించండి ప్లీజ్ … అప్పుడ‌యినా కారణం వెతికి వ‌స్తుంది కానీ చేస్తున్నామా మ‌నం…

వ్యాధి బ్యాక్టీరియ‌ల్
వ్యాధి ఫంగ‌ల్
వ్యాధి వైర‌ల్
కాదు వ్యాధి నేర్పిన భ‌యం
వైర‌ల్ అండ్ వ‌ర్చువల్
అండ్ అన్ డిఫైన్డ్ ఆల్సో  స‌మ్ టైమ్స్
మే ఇట్ హ్యాపెన్స్
డ్రాప్ ఎ లెట‌ర్
వుంటే ఉండు
పోతే పో
ఐసొలేటెడ్ వెర్ష‌న్
సిరితా.. వ‌చ్చినా వ‌చ్చును

అవునా
కాదు
రెండు విరుద్ధాల్లో
విష‌య సంక్లిష్ట‌త రాయ‌డం
న‌చ్చే ప‌ని
విభిన్న‌త మ‌ననం చేసుకున్నంత
చావు విభిన్నం
కొన్ని దేహ దారుల శుభ్ర‌త
ప్ర‌క్షాళ‌న  కరోనా చేయును
ను ను ను అవున‌వును

మార్నింగ్ రాగా : ఎరైవ‌ల్ ఆఫ్ హ్యాపెనింగ్స్

చ‌దువుతూ నిర్మోహిస్తూ
ఓ చోట ఆగి
చావులో అయిష్ట‌త పుట్టుక‌లో యిష్ట‌త
ఉందా లేదా అన్న‌ది ప్ర‌శ్నిస్తూ..
ముగిస్తున్నానొక మార్నింగ్ రాగా

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
అద్దంలో జీవితం అద్ద‌మంటి జీవితం
హా హా విరిగినచో వైనం అతికిన‌చో జ్ఞాప‌కం
అవును చో అన‌గా చోద‌కం ప్ర‌త్యయం కాదు 

Read more RELATED
Recommended to you

Latest news