అయోధ్య పోరాటం.. కల వెనుక కష్టించిన వీరులు

-

అయోధ్య రామజన్మభూమి.. ఒక పవిత్ర విషయం.ఇదే సమయంలో ఇదొక వివాదాస్పద అంశం. అయిత దీనిలో ఈ దేవాలయ నిర్మాణానికి నేడు మార్గం సుగమం అయింది. ఆగస్టు 5న భూమిపూజ చేస్తున్నసందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకఘట్టాలలో కీలకంగా పనిచేసిన కొందరు మహనీయుల గురించి ప్రతీ భక్తుడు తెలుసుకోవాలి. ఆ విశేషాలు….


అయోధ్య వివాదానికి సంబంధించి ఎందరో అవిశ్రాంతంగా అహోరాత్రులు తమ తమ ప్రయత్నాలు చేశారు. కొందరు న్యాయ పోరాటం.. కొందరు ఉద్యమ బాట.. మరికొందరు యాత్ర.. ఇలా తోచిన రూపాల్లో ఉద్యమాన్ని బలంగా హిందువు ల్లోకి తీసుకెళ్లారు. రాముడు సంధించి వదిలిన బాణాల్లా పని చేసిన పరమ వినయ విధేయ రామ భక్తుల పరిచయం..

మూల విరాట్టు – నాయర్

మహంత్ దిగ్విజయ్నాథ్


1949లో తొమ్మిది రోజుల పాటు వివాదా స్పద స్థలంలో రామచరిత మానస్ పారాయణం జరిగింది. ఈ పారాయణం కార్యక్రమం చేపట్టింది అప్పటి రామ జన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించిన మహంత్ దిగ్విజయ్నాథ్. పారాయణం చివరిలో హిందూ దేవతల విగ్రహాలు ప్రత్యక్ష మయ్యాయి. ఈ పరిణామాలు దిగ్విజయ్నాథ్ను హిందూ మహాసభలో తిరుగులేని నాయకుడిగా చేశాయి. ఆ తరువాత ఈయన ప్రత్యక్ష రాజ కీయాల్లోకి వచ్చి 1967లో గోరఖ్పూర్ ఎంపీ గానూ గెలిచారు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సేను మహాత్మాగాంధీ హత్యకు ఉసిగొల్పారనే ఆరోపణలపై ఈయన తొమ్మిది నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.

పట్టు వీడని పరాశరన్ “గాడ్స్‌ అడ్వకేట్‌”

సంత్ రామచంద్ర పరమహంస

అయోధ్యలోని రామ జన్మభూమిలో రామా లయం నిర్మించాలని 1934లోనే ఉద్యమం ప్రారంభించారు సంత్ రామచంద్ర పరమహంస. హిందూవాదుల మద్దతుతో మసీదును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు కూడా. తన ఉద్యమం కోసం రామజన్మభూమి న్యాస్ను ఏర్పాటు చేశారు. 1949లో మసీదులో రాముడి విగ్రహాలు ప్రత్యక్షం కావడంలోనూ ఈయనదే కీలకపాత్ర అని చెబుతారు. చిన్న చిన్న హిందూ సంఘాల మద్దతుతో ఆయన పలు కార్య క్రమాలు నిర్వహించారు. 2000లో ఈయన కన్ను మూశారు.

అశోక్ సింఘాల్ ‘హిందూ సింహం’

ఎల్‌కే అద్వాని తిరుగులేని నాయకత్వం

మురళీ మనోహర్ జోషి

భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో మురళీ మనోహర్ జోషి ఒకరు. అయోధ్య ఉద్యమంలో ఈయనదీ ప్రముఖ పాత్రే. అద్వానీ మాదిరిగానే ఈ ఉద్యమాన్ని ప్రజల చెంతకు తీసుకు వెళ్లడంలో ఈయన సఫలీకృతులయ్యారు. హిందువుల్లో భావోద్వేగాలను కలిగించారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా.. రామజన్మభూమి అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడంలో కృషి చేశారు.

ఉమా భారతి

రామజన్మభూమి ఉద్యమంతోనే ఉమాభారతి ప్రముఖ నాయకురాలిగా ఎదిగారు. అద్వానీ పక్కనే నిల్చుని ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ అందరినీ ఆకర్షించారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ పట్టు సడలించకూడదన్నది ఆమె ప్రగాఢ విశ్వాసం.

ప్రవీణ్ తొగాడియా

విశ్వహిందూ పరిషత్ అధినేత అశోక్ సింఘాల్ అనారోగ్యానికి గురైనపుడు.. ఈయనే వీహెచ్పీ బాధ్యతలను చేపట్టారు. ఆవేశపూరిత ప్రసంగాలు చేయడంలో, భావోద్వేగాలను సృష్టిం చడంలో ఈయన ప్రత్యేకతే వేరు. నాడు ఈయన ప్రతి ప్రసంగంలోనూ రామమందిర నిర్మాణమే ముఖ్యాంశంగా ఉండేది. సింఘాల్కు ఏమాత్రం తీసిపోకుండా ఈయన రామజన్మభూమి ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లారు.

గోరఖ్నాథ్ మఠం

గోరఖ్నాథ్ మఠం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్లో ఉంది. హిందూత్వ వాదానికి ఈ ప్రాంతం గొప్ప ఆయువుపట్టు. 11వ శతాబ్దం ఆరంభంలో హిందూ యోగి, సాధువు యోగి గోరఖ్నాథ్ ఈ మఠానికి బీజం వేశారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు ఆధ్యాత్మికంగానూ చైతన్య వంతమైన పాత్రను ఈ మఠం పోషించింది. మహంత్ దిగ్విజయ్నాథ్ తరువాత ఆయన వారసుడు మహంత్ అవైద్యనాథ్ 1962, 67, 69, 74, 77లో మణిరామ్ స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1970, 89లలో గోరఖ్పూర్ ఎంపీగానూ ఎన్నికయ్యారు. సంఘ్ పరివార్ స్వయంగా రామజన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అవైద్యనాథ్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున 1991, 96లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే మఠం నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ 1998 నుంచి గోరఖ్ పూర్ ఎంపీగా గెలుస్తూవచ్చారు. ఎంపీగా ఉంటూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాబ్రీ కూల్చివేతలోనూ యోగి ఆదిత్యనాథ్ పాత్ర కీలక మని అంటారు.
ఇలా అనేక మంది కృషి ఫలితంగా నేడు ఆయోధ్యలో రామజన్మభూమికి సాకారం అవుతుంది.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news