బ్రేకింగ్: రెండు దేశాలకు సునామీ వార్నింగ్

Join Our Community
follow manalokam on social media

పసిఫిక్‌ లోని లాయల్టీ దీవులకు ఆగ్నేయంగా బలమైన భూకంపం సంభవించింది. దీనితో బీచ్‌ లు మరియు తీర ప్రాంతాలకు న్యూజిలాండ్ అధికారులు గురువారం తెల్లవారుజామున కొన్ని విజ్ఞప్తులు చేసారు. తీర ప్రాంతాలను కాళీ చేయాలని విజ్ఞప్తి చేసారు. న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రజలు అహిపారా నుండి బే ఆఫ్ ఐలాండ్స్, గ్రేట్ బారియర్ ఐలాండ్ మరియు మాటాటా నుండి తోలాగా బే వరకు ఉన్న ప్రాంతాలలో ప్రజలు బీచ్ లకు దూరంగా ఉండాలని కోరారు.

“న్యూజిలాండ్ తీరప్రాంతాలు తీరంలో బలమైన మరియు అసాధారణమైన ప్రవాహాలు ఉన్నాయని మరియు అనూహ్య ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నామని” అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతలో, ఆఫ్‌షోర్ ఆస్ట్రేలియా ద్వీపాలు మరియు భూభాగాలకు సునామీ ముప్పు ఉందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటిరాలజీ తెలిపింది.

యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఇఎంఎస్సి) చేసిన ప్రకటన ప్రకారం 7.7 మాగ్నిట్యూడ్ తో సంబవించింది అని వెల్లడించారు. భూకంప కేంద్రం న్యూ కాలెడోనియాలోని టాడిన్‌ కు తూర్పున 417 కిమీ (258 మైళ్ళు) ఉందని, ఇది 10 కిమీ (6.2 మైళ్ళు) లోతులో ఉందని చెప్పారు. భూకంపం, అంతకుముందు 7.2 తీవ్రతతో వచ్చినట్టుగా పేర్కొన్నారు. కేవలం ఒక గంట వ్యవధిలో 5.7 నుండి 6.1 వరకు తీవ్రతతో వచ్చాయి. వనాటు, ఫిజి, న్యూజిలాండ్ సహా ఇతర ప్రాంతాలలో సునామీ సంభవించే అవకాశం ఉందని యుఎస్ సునామి హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...