కరోనా వైరస్…..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పేరు. చైనా లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు క్రమక్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కరోనా ప్రభావంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో ఏపీ సీఎం వైెస్ జగన్ ఒక అడుగు ముందుగానే ఉన్నారు. ఏపీలో కరోెనా నిరోధానికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, లేని పోని అపోహలు నమ్మోద్దని ప్రజలకు వివరించారు.
ప్రజలను ఆందోళనలకు గురి కాకుండా చూసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనాని ఎదుర్కోవడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్దంగా ఉండాలని గుర్తు చేశారు.ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనాను సీరియస్ గానే తీసుకుంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్ పోర్టుల వద్ద కరోనా టెస్టులు చేయడం కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది.