ఆ దేశాల్లో పరిస్థితి డిఫరెంట్ గా ఎలా మారింది ?

-

కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో అల్లాడిపోయిన దేశాలు పరిస్థితి ప్రస్తుతం చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా చైనా దేశం వ్యూహన్ పట్టణములో అయినా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా,  ఫ్రాన్స్ వంటి దేశాల్లో వైరస్ పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. వైరస్ ప్రారంభం వచ్చిన సందర్భంలో ఈ దేశాలలో భయంకరంగా విస్తరించింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పదికి మించి కూడా పాజిటివ్ కేసులు ఈ ప్రాంతాలలో నమోదు కావటం లేదు.Latest Coronavirus News (Live Updates) చాలావరకు కరోనా వైరస్ విరమణ ఆగిపోయింది. ముఖ్యంగా న్యూజిలాండ్ దేశంలో అయితే కరోనా వైరస్ జాడ అస్సలు కనిపించడం లేదు. ఇటీవల ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. అలాగే ఆస్ట్రేలియా దేశంలో కూడా చేపడుతున్న చర్యల వల్ల త్వరలోనే కరోనా రహిత దేశంగా ఆస్ట్రేలియా అవతరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా పుట్టినిల్లు వూహాన్ నగరంలో అయితే పదికి మించి కేసులు కూడా రావడం లేదని సమాచారం.

 

అలాగే ప్రపంచంలో అమెరికా కన్నా ముందు వైరస్ ధాటికి ఫ్రాన్స్ గజగజ వణికి పోయింది. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో కూడా వైరస్ పరిస్థితి ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లోనే పూర్వ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ  దేశాలలో వైరస్ ప్రభావం తగ్గటానికి కామన్ పాయింట్ ఏమిటంటే లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయడమే అని నిపుణులు అంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ బ్లాక్ చేసి ప్రజలను అప్రమత్తం చేసి లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయటంతో వైరస్ ఈ దేశంలో పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news