జనాలకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు అనేది వాస్తవం. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు గాని, ఎవరు కూడా మాట వినే ప్రయత్నం కూడా కనీసం చేసే అవకాశం ఉండదు. చేతులు కడుక్కోండి, మాస్క్ లు పెట్టుకోండి అని చెప్తే ఎవరూ వినడం లేదు. కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు, దానికి మార్గాలు చాలా ఎక్కువ అని చాలా మంది హెచ్చరిస్తున్నారు. అయినా జనంలో మార్పు రావడం లేదు.
ఇది పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో లో ఒక వ్యక్తి బయట నుంచి వస్తాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి చెందిన ఒక వ్యక్తి చేతులను శుభ్రం చేసుకోమని సూచిస్తాడు. కాని అతను వినకుండా అవసరం లేదని చెప్పి వెళ్లిపోతుంటే, లాగి బలవంతంగా హ్యాండ్ వాష్ చేయించి పంపిస్తాడు. అక్కడి నుంచి నెట్టేస్తాడు వెంటనే.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనాలకు సరిగా చెప్తే ఎవరూ వినరని, ఇలాగే చెప్పాలని, రోడ్ల మీదకు వచ్చే వాళ్ళను కొడితే గాని మాట వినే ప్రయత్నం చేయరని లాఠీ చార్జ్ మార్గం అని హెచ్చరిస్తున్నారు. అవసరం అనుకుంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసినా తప్పు లేదని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోన కేసుల సంఖ్య దాదాపు 500 గా ఉంది.