కరోనా వైరస్ దెబ్బకు మన దేశం ఇప్పుడు చాలా వరకు కూడా ఆత్మరక్షణ లో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మన దేశంలో కరోనా మరణాల రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. మరణాల రేటు 2.72 శాతానికి తగ్గిందని, ఇది ఇతర దేశాల కంటే తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే మరణాల రేటు తక్కువగా ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు శుక్రవారం 62.42 శాతంగా నమోదైందని చెప్పింది. 18 రాష్ట్రాలు మరియు యుటిలలో రికవరీ రేట్లు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అని వెల్లడించింది. జనాభాతో పోలిస్తే కేసులు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది.