కొవిడ్ నుంచి కోలుకున్నామని అనుకుంటే పొరపడినట్టే.. కీలక శక్తి తగ్గుముఖం..!

-

కరోనా వల్ల యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. దేశాలన్నీ అల్లాడిపోయాయని చెప్పొచ్చు. ఇక మనుషులు అయితే పిట్టల్లా రాలిపోయారు. ఫస్ట్ వేవ్ ఇక ముగిసింది అనుకునే లోపే సెకండ్ వేవ్ షురూ అయింది. అది అయిపోతుందనుకునేలోపే థర్డ్ వేవ్ అని మళ్లీ అంటున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ covid మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే కొవిడ్ బారిన పడి కోలుకున్నాక తమకేదీ కాదు అని అనుకుంటే భ్రమపడినట్లే.. ఇమ్యూనిటీ పవర్ ఉందని, యాంటీ బాడీస్ ఉంటాయని భావించినా పప్పులో కాలేసినట్లే.. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలోనూ పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వైరస్ మానవుల్లో ప్రధానంగా మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని, ఆ ప్రభావం ఇప్పటికీ ఉంటుందని వివరిస్తున్నారు.

లండన్ ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న 80 వేల మందిపై పరిశోధన చేసి ఆసక్తికర విషయాలు తెలిపారు. అవేంటంటే..కరోనా బారిన పడి ట్రీట్‌మెంట్ ద్వారా కోలుకున్న వారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల ఉందని తెలిపారు. వారికి కనీసంగా చిల్డ్రన్స్ బుక్స్ కూడా చదివి గుర్తు పెట్టుకునేంత జ్ఞాపకశక్తి ఉండటం లేదట. అంతకుమునుపులా వారు తర్కించే చాన్సెస్ తక్కువేనని చెప్తున్నారు. ఈ క్రమంలోనే హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న పలువురు కొవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత మునుపటి స్టైల్‌లో పని చేయలేకపోతున్నారని కేస్ స్టడీస్ ద్వారా వివరించారు. కొవిడ్ రూపాంతరం చెందుతూ వస్తుండగా, న్యూ వేరియంట్స్ బారిన పడితే దాని ప్రభావం కోలుకున్నాక కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో బయటపడిన డెల్టా వేరియంట్ బారిన పడి అంత త్వరగా కోలుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news