కరోనా సమయంలో ఆక్సీజన్ లెవెల్స్ చాలా కీలకంగా ఉన్నాయి. ఆక్సీజన్ లెవెల్స్ తగ్గితే అనవసరంగా సమస్యలు వస్తాయి. కరోనా రోగులు చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి మీ శరీర ఉష్ణోగ్రతను చూసుకోండి. ఉష్ణోగ్రత 101 పైన ఉంటే, పారాసెటమాల్ 650 ఎంజి టాబ్లెట్ తీసుకోండి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగించి మీ ఆక్సిజన్ లెవెల్ చూసుకోండి.
94 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఆందోళన చెందాల్సిన పనిలేదు. 94 శాతం కంటే తక్కువగా ఉంటే, శ్వాస వ్యాయామాలు (ప్రాణాయం) ప్రారంభించండి. మీకు వీలైనంత సమయం పొట్ట మీద నిద్రించండి. వీపుపైన భారం వేయవద్దు. ఆక్సిజన్ స్థాయి మెరుగుపడకపోతే, ఆరు నిమిషాల పాటు నడవండి. అలా నడవలేకపోతే మాత్రం కచ్చితంగా ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయినట్టే.