దేశంలో కరోనా ఎఫెక్ట్ మరింత పెరుగుతోంది. కరోనా వైరస్ మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. వైరస్ కార ణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి (63) ఆదివారం మృతిచెందారు. అలాగే బిహార్ రాజధాని పట్నాలో ఇటీవల ఖతర్ నుంచి వచ్చిన ఓ కరోనా బాధితుడు (38) మరణించారు. మహారా ష్ట్రలో రెండో మరణం నమోదు కాగా, దేశంలో కరోనా మృతుల సంఖ్య 6కి చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి 74 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా అధికారులను మరింత అప్రమత్తం చేశారు.
ఏ ఒక్కరినీ బయట తిరగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 285గా ఉన్న సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 324కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో పరిస్థితి మరింతగా చేయి దాటే అంచనాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభించకుండా తీసుకునే చర్యల్లో భాగంగా రాబోయే రెండు వారాలు మరింతగా ప్రభుత్వాల నుంచి కొంతమేరకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అంటే, ఇప్పుడు అమలులో ఉన్న జనతా కర్ఫ్యూ వంటివి రాష్ట్రాల వ్యాప్తంగా మరింతగా అమలయ్యే అవ కాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే దేశం మొత్తం 14 గంటల కర్ఫ్యూ అని అంటే.. తెలంగాణ సీఎం మా త్రం దీనిని 24 గంటలకు పెంచారు. ఇలాంటి నిర్బంధాలు, ఆంక్షలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితిని ఇలానే వదిలేస్తే.. ఇటలీ మాదిరిగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తుండడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. మొత్తానికి దేశంలో రాబోయే రెండు వారాలు కూడా అప్రకటిత కర్ప్యూ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.