జనతా కర్య్ఫూ… బయటకు రాని జనం…!

-

దేశ వ్యాప్తంగా జనతా కర్య్ఫూ విజయవంతంగా అమలు అవుతుంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా జనతా కర్ఫ్యూ ని అమలు చేస్తున్నాయి. ప్రజలు అందరూ స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు. ఎక్కడా కూడా చీమ చిటుక్కుమనడం లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ సర్వీసులు అన్నీ కూడా నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పై ప్రజలు యుద్ధం ప్రకటించారు.

అన్ని వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర సర్వీసులు మినహా ఏ ఒక్కటి కనపడటం లేదు. విజయవాడ, హైదరాబాద్, విశాఖ ఇలా ఏ నగరం చూసినా సరే ప్రధాన రహదారులు అన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. జనం ఎక్కడో ఒకరు ఇద్దరు మినహా రోడ్ల మీద కనపడటం లేదు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఒవర్ ని మూసి వేసారు అధికారులు

తెలంగాణాలో కూడా జనతా కర్ఫ్యూ విజయవంతంగా అమలు అవుతుంది. ఎక్కడా కూడా ప్రజలు బయటకు రావడం లేదు. అత్యవసర సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి తెలంగాణాలో. ఆర్టీసి బస్సులు అన్నీ నిలిపివేశారు. అత్యవసరంగా డిపో కి 5 బస్సులు మాత్రమే ఉంచారు అధికారులు. మీడియా ప్రతినిధులు మినహా ఎవరు కనపడటం లేదు. తెలంగాణాలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమలు కానుంది.

ప్రధాని మోడీ 14 గంటలు మాత్రమే కోరినా తెలంగాణా ప్రభుత్వం మాత్రం దాన్ని మరో పది గంటల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా అవసరం అనుకుంటే జనతా కర్ఫ్యూ ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణాలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలు కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో 5 మెట్రో రైళ్ళను మాత్రం అందుబాటులో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news