లాక్డౌన్ ఇంకెన్నాళ్లు స్వామీ!- సోషల్ మీడియాలో చర్చ.ఈ ప్రభుత్వాలకు చేతకాక లాక్డౌన్ విధించా యి. మనల్ని నిలువునా కాల్చేస్తున్నాయి- యువకుల కామెంట్లు లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉండలేకపోతున్నాం- మహిళల ఏవగింపు బోర్ కొడుతోంది.. బయటకు రాకుండా ఉండలేకపోతున్నాం- మధ్యవయస్కుల ముచ్చట్లు!!
నిజమే.. లాక్డౌన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక, ఏపీలోనూ ప్రజలు ఇళ్ల లోనే ఉంటున్నారు. గత నెల 21 నుంచి విధించిన లాక్డౌన్ పరిణామాలతో ప్రజలు విసిగెత్తి పోతున్నమా ట వాస్తవం. బహుశ అందుకేనేమో.. ప్రధాని మోడీ అప్పుడప్పుడు వచ్చి బిగ్‌బాస్ మాదిరిగా ప్రజలకు చప్ప ట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అంటూ టాస్కులు ఇస్తున్నారు.
వాస్తవానికి ఈ లాక్డౌన్ ఈ నెల అంటే ఏప్రిల్ 14తోనే ముగిసిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని మరింత పొడిగించే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రబుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో ప్యానిక్ పెరగకుండా చూసుకుంటున్నారు. వాస్తవానికి లాక్డౌన్ గురించిన వాస్తవం తెలుసుకుంటే.. ప్రజలు ఇంతగా ఫీలయ్యే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు. అమెరికా, ఇరాన్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో లాక్డౌన్ విషయంలో ప్రజలు లైట్‌గా తీసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో అయితే.. లాక్డౌన్ విధంచనంటే విధించనని, ఇది తనకు, తన ప్రభుత్వానికి అవమానమని భీష్మించిన అక్కడి అధ్యక్షుడు ట్రంప్.. లాక్‌డౌన్‌పై మీనమేషాలు లెక్కించారు. దీంతో కరో నా కోరలు చాచింది. ఇక, స్పెయిన్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించినా.. కట్టుది ట్టం చేయకుండా స్వచ్ఛందం అని ప్రకటించింది. దీంతో ఇప్పుడు లక్షల్లో కరోనా రోగులు పెరిగిపోయి.. వేలల్లో చనిపోతున్నారు. ఇటలీలో నూ ఇదే పరిస్థితి నెలకొంది. కనిపిస్తే కాల్చివేతలకు ఇప్పుడు రంగం సిద్ధమైంది.
మొత్తంగా లాక్డౌన్ లేకపోయి ఉంటే.. భారత్ కూడా మరో ఇటలీనో.. స్పెయినో అయి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. లాక్డౌన్ ద్వారానే కరోనా వ్యాప్తిని నిరోధించగలమనేది వాస్తవం. ఈ విషయంలో ప్రజలు కొద్దిగా అలెర్ట్ అయితే.. ఇక, విసుగు అనే మాట. విమర్శలు అనే వ్యాఖ్యలకు స్థానం ఉండదని అంటున్నారు.