క‌రోనాపై పోరాటానికి.. పీఎం కేర్స్‌కు విరాళం పంపుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

-

క‌రోనాపై పోరాటం చేసేందుకు.. క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు.. ప్ర‌ధాని మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ఇక యావ‌త్ దేశ ప్ర‌జ‌లు ఈ విప‌త్తును స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాలంటే.. త‌మ‌కు తోచినంత విరాళాన్ని అందించాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పీఎం కేర్స్ (PM CARES) పేరిట ఓ నిధిని ఏర్పాటు చేసి.. దానికి అంద‌రూ విరాళాలు పంపాల‌ని మోదీ సూచించారు. అయితే కొంద‌రు ప్ర‌బుద్ధులు దీన్ని ఆస‌రాగా తీసుకుని.. ఏకంగా పెద్ద ఎత్తున డ‌బ్బులు దోచేయాల‌ని ప్లాన్ వేశారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

sending donations to pm cares fund then you should know this

పీఎం కేర్స్‌కు విరాళాలు పంపించేందుకు గాను కేంద్రం pmcares@sbi పేరిట ఓ యూపీఐ ఐడీని ఇప్ప‌టికే క్రియేట్ చేసి ప్ర‌జ‌లు దానికి త‌మ విరాళాలు పంపాల‌ని తెలియ‌జేసింది. అయితే కొంద‌రు సైబ‌ర్ మోస‌గాళ్లు pmcares@sbi లో చివ‌ర్లో ఉండే s అక్ష‌రాన్నితీసేసి pmcare@sbi అనే న‌కిలీ యూపీఐ ఐడీని క్రియేట్ చేశారు. దీంతో కొంద‌రు ఇదే నిజ‌మైన యూపీఐ ఐడీ అనుకుని దానికి విరాళాలు పంపుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ న‌కిలీ యూపీఐ ఐడీ ప‌ట్ల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఢిల్లీ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

pmcare@sbi పేరిట ఏర్పాటు చేసిన న‌కిలీ యూపీఐ ఐడీకి ఎవ‌రూ డ‌బ్బులు పంపించ‌వ‌చ్చ‌ని ఢిల్లీ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఒరిజిన‌ల్ యూపీఐ ఐడీకే ప్ర‌జ‌లు విరాళాలు పంపాల‌ని సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా స‌రే.. విరాళం పంపేముందు ఒక‌సారి యూపీఐ ఐడీని వెరిఫై చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. క‌నుక‌.. మీరు కూడా మీ విరాళాన్ని అస‌లు యూపీఐ ఐడీకే పంపండి.. న‌కిలీ యూపీఐ ఐడీకి పంపితే.. మీరు పంపిన స‌హాయం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తుంది.. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌..!

Read more RELATED
Recommended to you

Latest news