గాజులరామారంలో టీకా కోసం క్యూలో నిల్చున్న చెప్పులు

-

కరోనా కేసులు భారీగా పెరగడంతో వాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రజలు అందరికి వాక్సిన్ అందించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మే 1 నుంచి ఉచితంగా వాక్సిన్ అందిస్తున్నాయి. దీనితో ప్రజలు కూడా వాక్సిన్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో వాక్సిన్ కోసం లైన్ లో నిలబడిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కరోనా టీకాల కోసం చెప్పులు క్యూలో ఉంచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గ్రామంలోని బస్తీ దవాఖానలో ఈ దృశ్యం కనపడింది.

ఆయన ప్రాంతాల్లో ఎక్కడా వాక్సిన్ లేకపోవడంతో ప్రజలు వాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నారు. గురువారం ఉదయం టీకాలు వేసుకునేందుకు ప్రజలు రాగా… అక్కడ రద్దీ ఏర్పడింది. ఉదయం 9 గంటలకు వృద్దులు కూడా అక్కడికి చేరుకోగా స్లిప్పులు తీసుకున్న వారికి మాత్రమే టీకాలు అందిస్తామని చెప్పారు. కొత్తగా వచ్చే వారు క్యూలో ఉండమని చెప్పడంతో మద్యాహ్నం 12 గంటలకు ఎండతీవ్రత ఎక్కువ కావడంతో అందరూ చెప్పులు క్యూలో పెట్టారు. వృద్ధురాలు తన చెప్పును లైన్ లో పెట్టి పక్కకు వెళ్ళగా అందరూ కూడా ఆమె బాటలో నడిచారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news