పక్క ఇండ్లలోకి మూత్రం సీసాలు విసిరేసిన తబ్లిగీ జమాత్‌ సభ్యులు

-

ఇప్పటికే వారివల్ల దేశవ్యాప్తంగా వేలాదిమందికి కరోనా సోకింది. ఇంకా వెకిలిచేష్టలతో, మూర్ఖత్వంతో కరోనా మరింత విజృంభించడానికి కారణభూతులవుతున్నారు.

ద్వారక – ఆగ్నేయ ఢిల్లీలోని ఉప నగరం. ఆసియాలోనే అతిపెద్ద ఉప నగరంగా ఖ్యాతి పొందింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గర్లో ఉంటుంది. పలు సెక్టార్లుగా విభజించబడిన ఈ ఉప నగరంలో ఎక్కువగా వివిధ హౌజింగ్‌ సొసైటీల ద్వారా కేటాయించిన ఇండ్లు ఉంటాయి.

అక్కడి సెక్టార్‌-16బి లోని ఓ బిల్డింగ్‌లో క్వారెంటైన్‌ చేయబడ్డ తబ్లిగీ జమాత్ సభ్యులను ఉంచారు. నిన్న (మంగళవారం 7 ఏప్రిల్‌) సాయంత్రం ఈ తబ్లిగీ కార్యకర్తలు, తమ మూత్రాన్ని సీసాల్లో నింపి పక్క బిల్డింగుల్లోకి విసిరేయడం ప్రారంభించారు. ఆ మూత్రం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఉత్తర ద్వారక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్వారంటైన్‌ కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసారు. తన ఫిర్యాదులో ‘‘ కరోనా వ్యాధిని ఇరుగుపొరుగు వారికి వ్యాపింపజేసే ఉద్దేశ్యంతో ఈ నికృష్టపు పనికి పూనుకున్నార’’ని ఆ కేంద్ర అధిపతి పేర్కొన్నారు.

తబ్లిగీ జమాత్‌ సభ్యులు ఇలా మూత్రం సీసాలు విసురుతుండగా, అక్కడే నివసించే ఒక వ్యక్తి తన మొబైల్‌ఫోన్‌లో విడియో తీసి పోలీసులకు అందజేసాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అసుపత్రి సిబ్బందిని తబ్లిగీ జమాత్‌ సభ్యులు వెకిలిచేష్టలతో వేధించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహోదగ్రుడయ్యి, వారిని ‘‘మానవత్వానికే శత్రువులు’’గా అభివర్ణించారు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవకముందే ఢిల్లీలో ఈ సంఘటన జరగడం సంచలనం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news