తెలంగాణా ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా

-

మరో తెలుగు రాష్ట్రం అయిన ఆంద్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తక్కుగానే నమోదవుతున్నాయి. అయినా సరే రాష్ట్రంలో గట్టిగానే కేసులు నమోదవుతున్నాయని చెప్పచ్చు, ఇక తెలంగాణాలో ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే, తెలంగాణా ప్రభుత్వ విప్ అయిన రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆయన ప్రస్తుతం భద్రాద్రి జిల్లా పినపాక ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్న జిల్లాలోని అనంతారం పంచాయతీ కొత్తూరు నుంచి వయా చొప్పాల మీదుగా 9 గ్రామాలను కలుపుతూ సమత్‌మోతే పంచాయతీ గొల్లగూడెం వరకు పీఎంజీఎస్‌వై నిధులు రూ. 2.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావులు శంకుస్థాపన చేశారు. దీంతో ఈయన తనతో కలిసిన అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news