గుడ్ న్యూస్ : కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చేస్తుంది..!

-

ప్రపంచ దేశాలన్నీటిని కరోనా అనే మహమ్మారి పట్టి పీడిస్తుంది. అగ్రరాజ్యాలు సైతం దీని ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడి మరణించారు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ దీనికి మందు మాత్రం కనుక్కొలేకపోతున్నారు. కొంత మంది అదిగి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్తున్నప్పటికీ.. ఇప్పట్లో ఈ మహమ్మారికి విరుగుడు రావడం కష్టమే అని తేల్చేశారు చాలామంది ప్రముఖ శాస్త్రవేత్తలు.

అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్‌ పై ప్రపంచానికి ఒక శుభవార్త చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌. ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ తాజా ఔషధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్‌ సౌమ్య మాట్లాడారు. పదిమందిపై వ్యాక్సిన్‌ క్లినికల్‌ ప్రయోగం జరుగుతోందని, వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడవ దశకు చేరుకున్నటుగా ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news