ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా ఒమైక్రాన్ ఉప వేరియంట్లు ఉన్నాయన్న WHO..

-

పులి నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే.. దాని అర్థం అది భయపడిందని కాదు.. పంజా విసరబోతుంది అంటారు.. కరోనా విషయంలో కూడా అదే జరగబోతున్నట్లు ఉంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కరోనా ఇప్పుడు విజృంభిస్తుంది. కరోనా సమస్య ఇంకా తొలగిపోలేదని మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దేశాలను అలర్ట్ చేసింది. అతి పెద్ద సమస్య చైనా నుంచే వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియా లాంటి దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు.. కరోనాపై విజయం సాధించినట్లు భావిస్తున్నారు. కరోనాను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది.

కరోనా ముప్పు తొలగిపోలేదనీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించింది. ప్రస్తుతం చైనాతోపాటూ.. కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో చాలా దేశాలు కరోనా ఆంక్షలను ఎత్తివేశాయి. అయితే రాబోయే కాలంలో మరిన్ని కరోనా వేవ్స్‌ వచ్చే ప్రమాదం ఉందని WHO అంచనా వేసింది. అందుకు కారణం చైనాయే అని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ ఉప వేరియంట్లు 500కు పైగా ఉన్నాయన్న WHO.. చైనాలో రకరకాల వ్యాధులు పెరుగుతుండటం అతి పెద్ద సమస్యగా ఉందని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ ఉప వేరియంట్లు 500కు పైగా ఉన్నాయన్న WHO.. చైనాలో రకరకాల వ్యాధులు పెరుగుతుండటం అతి పెద్ద సమస్యగా ఉందని తెలిపింది. ఒమైక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల మున్ముందు కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని WHO అధికారి మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా నిబంధనలను సడలించడం, వేగంగా వ్యాపించే లక్షణం ఒమైక్రాన్ వేరియంట్లకు ఉండటం వల్ల కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే ఎన్ని వేరియంట్లు వచ్చినా.. వాటివల్ల ప్రాణంతకం అయితే ఉండదని అంటున్నారు.. మునపటిలా భయపడాల్సిన పని లేదు.. కరోనా కేసులు పెరుగుతున్నా.. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండకపోవడానికి కారణం.. ప్రజల్లో పెరిగిన వ్యాధి నిరోధక శక్తి అని అంచనా వేసిన కెర్కోవ్.. అందరూ వ్యాక్సిన్లు వేసుకునేలా చెయ్యాలనీ.. ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్నవారు, 60 ఏళ్లు దాటిన ముసలివారికి తప్పనిసరిగా వ్యాక్సిన్లు వెయ్యాలని సూచించారు.

తాజాగా డిసెంబర్ 30న WHO చైనా అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న అంశంపై మరింత సమాచారం కావాలని కోరిన WHO.. తమ వైపుగా ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. చైనా కరోనా కేసులు, మరణాలకు సంబంధించి పూర్తి డేటా ఇవ్వడం లేదని నిజాలను దాచిపెడుతుందనే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. ఇలా చేయకుండా పూర్తి సమాచారం పారదర్శకంగా ఇస్తే.. ప్రపంచ దేశాలను అలర్ట్‌ చేసే అవకాశం ఉందని WHO తెలిపింది.

జన్యుపరమైన డేటా, కరోనా ప్రభావం, ఎంత మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు?, ICUలో ఎంత మంది చేరుతున్నారు. మరణాల సంఖ్య, వ్యాక్సిన్ల పనితీరు వంటి వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలని WHO అధికారులు చైనాను కోరారు. జనవరి 3న జరిగే నెక్ట్స్ మీటింగ్‌లో డేటా ఇవ్వాలని కోరారు. దీనిపై చైనా అధికారులు, సైంటిస్టులు కచ్చితమైన హామీ ఇవ్వలేదని తెలిసింది.. చైనా సరైన డేటా ఇవ్వకపోతే..చాలా ప్రమాదం.. పుకార్లు షికార్లు చేస్తాయి.. అసలు ప్రమాద స్థాయి తెలియక కఠినమైన ఆంక్షలు పెట్టి మళ్లీ లాక్‌డౌన్‌ కూడా చేసే అవకాశం లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news