తల్లిపాలతో బిడ్డకి కరోనా సోకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

-

కరోనా మొదటి వేవ్ వచ్చిన తర్వాత అది దానితో పాటు సెకండ్ వేవ్ తీసుకువస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ విజృంభించినప్పటికీ మనదాకా రాదులే అనుకున్నారు. కానీ వారి ఊహలని అబద్ధం చేస్తూ చాలా తక్కువ సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా విజృంభించేస్తుంది. ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతున్నా కూడా సెకండ్ వేవ్ బారిన పడుతున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.

దీంతో చాలామంది జనాల్లో భయం ఎక్కువ అవుతుంది. అందుకే జాగ్రత్తలు తీసుకోవడంలో ముందుంటున్నారు. ఐతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని సందేహాలు మిగిలిపోతున్నాయి. సెకండ్ వేవ్ పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్నాయి కాబట్టి, పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పాలిచ్చే తల్లుల కారణంగా పిల్లలకి కరోనా వస్తుందా అన్న సందేహం ముందుకు వచ్చింది. ఇదే మొదటి వేవ్ లో అయితే ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా రాలేదు.

ఇప్పుడు రావడానికి కారణం పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడమే. ఐతే దీనికి నిపుణులు సమాధానం ప్రకారం, లక్షణాలు ఉండడం వల్ల పాలివ్వడం ఆపకూడదని, పాలివ్వడం ఆపేస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుందని, అది ఎంతమాత్రమూ మంచిది కాదని సూచిస్తున్నారు. తల్లిపాలలో ఇమ్యునోగ్లోబిన్స్, యాంటిబాడీస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి చాలా ఆరోగ్యకరం. అందుకే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పాలివ్వడం ఆపకూడదని అంటున్నారు. కాకపోతే మాస్క్, శానిటైజర్ శుభ్రత మొదలగునవి పాటించాలని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పాలివ్వచ్చని, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news