కార్తీకంలో ఏం తినకూడదో తెలుసా?

-

కార్తీకం అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అంతేకాదు లక్ష్మీ, గౌరీ, కార్తీకేయులకు కూడా ప్రత్యేకమైన మాసం ఇది. అయితే ఈ మాసంలో స్నానం, దీపం, దానంతోపాటు ఉపవాసం దానిలోనూ పలు ఆహారా నియమాలు చాలా ముఖ్యం. ఈ మాసంలో ఏం తినకూడదో తెలుసకుందాం…కార్తీక మాసమంతా నియమాల్ని పాటించేవారు ఉల్లి, ఇంగువ, పుట్టగొడుగు, గంజాయి, ముల్లంగి, ఆనపకాయ/సొరకాయ, మునగకాయ, వంకాయ, వెలగపండు, రెండుమార్లు వండిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు, కందులు వంటి ద్విదళ ధాన్యాలు వినియోగించ కూడదు.

వీటితోపాటు సప్తమినాడు ఉసిరిక, తిలలు, అష్టమినాడు కొబ్బరి, ఆదివారం ఉసిరిక వాడకూడదు. కార్తీక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే అంత్యమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని పురాణాలు పేర్నొన్నాయి. నిజానికి వీటన్నింటి వెనుక శాస్త్రీయత ఉంది. శరత్‌రుతువు ఈ మాసంతో ముగుస్తుంది. వచ్చే హిమవంత రుతువుకు శరీరాన్ని సిద్ధం చేయడంతోపాటు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడటం కోసం ఈ నియమ నిబంధనలు పెట్టారని పండితులు పేర్కొంటున్నారు. ఏదై ఏమైనా శాస్త్రం మీద నమ్మకంతో ఆచరిస్తే తప్పక మంచే జరుగుతుంది. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. భక్తి, ముక్తినిచ్చే కార్తీక మాస నియమాలను పాటించి ప్రకృతితోపాటు పయనిద్దాం.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news