మహిళలు ,మహారాణులు ..!

-

సమాజం లో అన్ని మారుతున్నాయి ..ఒక్క మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప.అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ‘అని శ్లోకం.దీనికి అర్ధం ఏమిటి అంటే ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్ధం.కానీ దేవత గా కొలవాల్సిన స్త్రీని మన దేశంలో ఏ విధముగా చూస్తున్నారో ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటె మనము ఎంత అనాగరికం లో జీవిస్తున్నామో తెలుస్తుంది..

సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో ,స్వశక్తి తో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.విద్య ,వైద్య ,రాజకీయాలు ,సినిమాలు అంటూ ఏ రంగం అయినా పురుషులు తో సమానంగా తాము ఎందులో తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు.తాము ఇంటికే పరిమితమే కాదు అని పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు.పురుష శక్తికి తాము ఏమి తీసిపోమని చాటిచేప్తుంది స్త్రీ శక్తి.

‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని ఎవరో కవి చెప్పినట్లు గా ప్రతి మగాడి జీవితం లో తోడుగా నిలుస్తుంది .అతని ప్రతి విజయం లో అండగా నిలుస్తుంది. అందుకేనే ఏమో మహిళల ఔన్యత్యాన్ని గుర్తిస్తూ వారికి అంటూ మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించారు .ఎప్పుడు అయితే మహిళను గౌరవం గా పూజిస్తారో ఆనాడే వాళ్ళకి అసలైన మహిళా దినోత్సవము ..

Read more RELATED
Recommended to you

Latest news