2019 Roundup : ఈ ఏడాది దేశాన్ని భయపెట్టిన ఘటనలు ఇవే…?

-

2019 దేశానికి ఏం సంతోషాలు ఇచ్చింది అనే దాని కంటే ఎక్కువ భయపెట్టింది అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రజల్లో ఒకరకమైన భయాన్ని ఈ ఏడాది కలిగించింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అవి ఏంటీ అనేది ఈ స్టొరీలో చూద్దాం.

పుల్వామా దాడి” జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఈ ఘటనలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది.

కచ్చులూరు బోటు ప్రమాదం” తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పై జరిగిన ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో పడవ ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

వరదలు” ఉత్తర భారతదేశాన్ని ఈ ఏడాది వరదలు భయపెట్టాయి. దాదాపు 2 వేల మంది మరణించారు.

ఆర్టికల్ 370 రద్దు” ఈ ఏడాది దేశంలో ఆందోళనలకు కారణమైంది. జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను ఆపేయడంతో ఈ ఘటనకు సంబంధించి ఆందోళనలు బయటి ప్రపంచానికి తెలియలేదు. రెండు దేశాల మధ్య యుద్దానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన నెలకొంది.

ఎన్నార్సి, క్యాబ్” ఈ రెండు దేశాన్ని ఇప్పటికి ఊపెస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉత్తరభారత దేశంలో, కర్ణాటకలో పెద్ద ఎత్తున హింస, ఆస్తుల ద్వంశం కూడా జరుగుతుంది.

దిశా ఘటన” అంతర్జాతీయంగా దేశం పరువు తీసిన ఘటన ఇది. దేశ వ్యాప్తంగా ఈ ఘటనతో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. అంతర్జాతీయ మీడియాలో కూడా ఇది హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news