ఫ్యాక్ట్ చెక్: ఇంటెలిజెన్స్ బ్యూరో FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చెయ్యచ్చా…? అలాంటి రూల్ ఏమైనా వచ్చిందా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

ఇప్పుడు ఓ వార్త వైరల్ గా మారింది. ఇంటెలిజెన్స్ బ్యూరో FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చెయ్యచ్చని.. ప్రశ్నించచ్చని… ఈ మేరకు ఓ బిల్ ని తీసుకు వచ్చారని.. వచ్చే పార్లిమెంట్ వింటర్ సెషన్ అప్పుడు ఆమోదిస్తారని ఓ వార్త వచ్చింది. మరి నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి.. ప్రశ్నించవచ్చా..?

దీనిలో నిజం ఏమిటనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చెయ్యచ్చని వచ్చిన వార్త ఫేక్ ఏ. దీనిలో నిజం లేదు. ఇలాంటి నోటీసు ఏమి రాలేదు. కనుక అనవసరంగా ఇలాంటి వాటిని నమ్మకండి. మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news