రోడ్డుపక్కన ఈ మొక్కను చూశారా..? ఇసారి కనిపిస్తే వదలకండి..!!

మనకు తెలియదు కానీ.. ఈ భూమ్మీద ఉన్న ప్రతి మొక్క దాని ప్రత్యేకతను కలిగి ఉంది.. మనం కొన్నింటినే గుర్తించాం. మరికొన్నింటిని పిచ్చి మొక్కల జాబితాలో వేశాం.. రోడ్డు పక్కన చాలా మొక్కలు ఉంటాయి. అవి అన్నీ ఎందుకు పనికిరానివని మనం అస్సలు పట్టించుకోం..అలా మనం వదిలేసిన జాబితాలో ఒకటైనా పచ్చ వాయింట మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం..!ఎందుకంటే..ఇది పిచ్చిమొక్క కాదు..ఎంతో మంచి మొక్కండీ బాబూ..!
ఈ మొక్కను వావింట‌, వామింట అని కూడా పిలుస్తారు.. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తినే వారు. దీనిని సంస్కృతంలో బ‌ర్బ‌రీ, అజ‌గంధ‌ అని హిందీలో తిల‌వ‌న్ పిలుస్తారు. వావింట మొక్క‌కు స‌న్న‌టి కాయ‌లు కూడా ఉంటాయి. వీటి గింజ‌లు చూడ‌డానికి ఆవ గింజ‌ల్ల‌గా ఉంటాయి. ఈ మొక్క స‌మూల చూర్ణం కారం రుచిగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

ప‌క్ష‌వాతాన్ని, గుండెసంబంధిత స‌మ‌స్య‌ల‌ను, క‌ఫ రోగాల‌ను, చెవి రోగాల‌ను, క్రిమి రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
చ‌లిగాలిలో ప‌ని చేసిన‌ప్పుడు చాలా మందిలో త‌ల నిండా క‌ఫం చేరి త‌ల‌నొప్పి వ‌స్తుంది. ముక్కు నుండి, క‌ళ్ల నుండి నీరు కారుతూ ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో ఈ వావింట ఆకును మెత్త‌గా నూరి బిళ్ల లాగా చేసి మాడుపై పెట్టి క‌ట్టు క‌ట్టాలి. ఇలా ఉంచిన కొద్ది స‌మ‌యం త‌రువాత త‌ల‌పై వేడిగా అనిపిస్తుంది. అలాంటి స‌మ‌యంలో ఆకు ముద్ద‌ను తీసి దాని నుండి నీరు పిండాలి. మ‌ర‌లా ఈ ముద్ద‌ను మాడుపై ఉంచాలి. వేడిగా అనిపించ‌గానే నీటిని పిండి మ‌ర‌లా మాడుపై ఉంచాలి. ఇలా రెండు నుండి మూడు సార్లు చేయాలి. వేడిగా అనిపించిన త‌రువాత కూడా ఆకును అలాగే ఉంచితే త‌ల‌పై పుండు వస్తుంది…కాబట్టి వేడిగా అనిపించ‌గానే ఆకు ముద్ద‌ను తీసివేయాలి. ఇలా చేస్తే జలుు, తలనొప్పి దెబ్బకు తగ్గిపోతాయి.
వావింట మొక్క‌ను స‌మూలంగా సేక‌రించి ముక్క‌లుగా చేసి దంచుకుని దాని నుండి ర‌సం తీయాలి. ఈ ర‌సానికి స‌మానంగా నువ్వుల నూనె క‌లిపి నూనె మిగిలే చిన్న మంట‌పై వేడి చేయాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను గోరు వెచ్చ‌గా చేసి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న చోట రెండు పూట‌లా రాస్తూ ఉంటే గ‌జ్జి, తామ‌ర‌, దుర‌ద వంటి అనేక చ‌ర్మ రోగాలు త‌గ్గుతాయి.
చెవి నొప్పితో బాధ‌ప‌డే వారు ఈ వావింట మొక్క ఆకుల ర‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌ల చొప్పున చెవిలో వేసుకోవ‌డం వ‌ల్ల చెవినొప్పి త‌గ్గుతుంది.
వావింటాకును, ఉప్పును క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని దుర‌ద ఉన్న చోట రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దుర‌ద వెంట‌నే త‌గ్గుతుంది. దుర‌ద త‌గ్గ‌గానే నీటితో శుభ్రంగా క‌డుక్కోవాలి.
ప‌రిశుభ్ర‌మైన ప్రాంతంలో పెరుగుతున్న వావింట‌ మొక్క ఆకుల‌ను సేక‌రించి పప్పు కూర‌గా, పులుసు కూర‌గా, వేపుడుగా వండుకుని కొద్దిగా అన్నంతో క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌గ్గు, జలుబు, క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.
ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి గ‌డ్డ‌ల‌పై ఉంచి క‌ట్టు క‌ట్టాలి. మంట పుట్టిన మ‌రుక్ష‌ణ‌మే తీసి వేయాలి. దీని వ‌ల్ల మొండి గ‌డ్డ‌లు అతి త్వ‌ర‌గా ప‌క్వ‌మ‌య్యి ప‌గిలి నొప్పి త‌గ్గుతుంది.
ఆయుర్వేదంలో వావింట మొక్కకు మంచి ప్రాముఖ్యత ఉంది.