ఫ్యాక్ట్ చెక్: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని పొందలేరు..కొత్త రూల్..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోస పోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు ఈ వార్త తెగ షికార్లు కొడుతోంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని పొందలేరు అని ఈ వార్త వైరల్ అవుతోంది.

నిజంగా పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని పొందలేరా..? దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని పొందలేరు అనేది నకిలీ వార్త. ఇదేమి నిజం కాదు. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం పొల్యూషన్ సర్టిఫికెట్ లేక పోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని పొందవచ్చు. వచ్చిన వార్త నకిలీ వార్త మాత్రమే. కనుక ఇలాంటివి నమ్మద్దు. మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news