ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన ఉత్తరం లో.. నిజం ఎంత..?

-

చాలా మంది నకిలీ వార్తన్ని చూసి నిజం అని నమ్ముతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు ఎక్కువగా కనపడుతున్నాయి, నిజానికి ఇలాంటి నకిలీ వార్తలని చూసి చాలా మంది మోసపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు అకౌంట్ కూడా సున్నా అయిపోతుంది. ఏది ఏమైనా నకిలీ వార్త ఏది నిజమైనది ఏది అని తెలుసుకోవాలి. ఇది నిజంగా ఎంతో ముఖ్యము.

లేకపోతే అనేక మోసాలకి చాలామంది గురవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్లని అడుగుతోందని ఒక లేఖ వచ్చింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిజంగా ఇలాంటి లెటర్ ని జారీ చేసిందా..? ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ షిప్ కోసం కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాలా..? ఈ లెటర్ లో నిజం ఎంత అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇలాంటి లెటర్ ని జారీ చేయలేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే ఇందులో ఏమాత్రం నిజం లేదు సోషల్ మీడియాలో స్కీములు మొదలు జాబ్స్ వరకు చాలా నకిలి వార్తలు వస్తున్నాయి ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news