ఫ్యాక్ట్ చెక్: వ్యాక్సిన్ తీసుకుంటే మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్ ని ప్రభుత్వం ఇస్తోందా..?

ఈ మధ్య కాలంలో ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. నిజానికి ఏది ఫేక్ వార్తో ఏది నిజమైన వార్తో తెలియడం లేదు. తాజాగా ఒక వార్త వచ్చింది. అయితే అది ఫేక్ వార్త లేదు అంటే నిజమా అనేది ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఏదో ఒక వార్త వినబడుతూనే ఉంటుంది.

 

తాజాగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకి మూడు నెలలపాటు రీఛార్జ్ ఫ్రీగా ఇస్తున్నట్లు ఆ వార్తలో ఉంది. అయితే నిజంగా ప్రభుత్వం ఈ అద్భుతమైన ఆఫర్ ని ఇస్తోందా..? రిలయన్స్, జియో, ఎయిర్టెల్ లేదా విఐ ఉన్నవాళ్ళకి రీఛార్జ్ ని మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తున్నట్లు అందులో ఉంది. పైగా అందులో ఒక లింకు కూడా ఉంది.

Image

ఐతే ఇందులో నిజమెంత అనేది చూస్తే…. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వార్తలని నమ్మొద్దు. ఫార్వర్డ్ చెయ్యొద్దు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అనవసరంగా ఇటువంటి ఫేక్ వార్తలు నమ్మితే మోసపోతారు. డిసెంబర్ 20 వరకు వ్యాలిడిటీ ఉన్నట్లు కూడా అందులో ఉంది. లింక్ మీద క్లిక్ చేయమని ఉంటుంది. అయితే అటువంటి నకిలీ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. ఇలాంటి ఆఫర్స్ పై క్లిక్ చేశారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.