ఫ్యాక్ట్ చెక్: కరోనా కి సంబంధించి విషయాలని వాట్సాప్ లో షేర్ చెయ్యకూడదు..?

-

ఈ రోజుల్లో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని చూస్తే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా తెలియడం లేదు. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కరోనా కేసులు మళ్ళీ చైనా లో పెరగడం వలన అందరిలోనూ ఆందోళన మొదలైంది.

పైగా కరోనా కి సంబంధించి నకిలీ వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి ఇక ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మరి వలన మనం ఎంత గానో ఇబ్బంది పడ్డాము. చాలామంది చనిపోయారు కూడా. అయితే తాజాగా వస్తున్న వార్త విషయానికి వస్తే.. కరోనాకి సంబంధించి పోస్టులు ఏమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే శిక్షిస్తారని కేవలం ప్రభుత్వ ఏజెన్సీలో మాత్రమే కరోనాకి సంబంధించిన విషయాలని పోస్ట్ చేయాలని ఈ వార్తలో ఉంది.

ఒకవేళ కనుక కరోనాకి సంబంధించి విషయాలు వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తే ఐటి ఆక్ట్ కింద వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారని అందులో ఉంది మరి ఇంతకీ ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇది నకిలీ వార్తని తెలుస్తోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు ఇటువంటి వార్తలని అనవసరంగా నమ్మి మోసపోకండి. అలానే లాక్ డౌన్ విధిస్తారని వచ్చిన వార్త కూడా నకిలీ వార్త. ఇటువంటి ఫేక్ వార్తలు నేను నమ్మకండి ఇతరులకి మీరు ఏదైనా విషయం షేర్ చేసే ముందు ఆలోచించండి.

Read more RELATED
Recommended to you

Latest news